Share News

విద్యార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యం

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:41 PM

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మద్య తరగతి కుటుం బాల విద్యార్థులు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉం డకూడదనే మంథనిలో సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

విద్యార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యం

మంథని, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మద్య తరగతి కుటుం బాల విద్యార్థులు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉం డకూడదనే మంథనిలో సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సింగరేణి సీఎస్‌ఆర్‌ నిధులు రూ.7.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ను, 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను సోమవారం కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రి అల్పాహా రాన్ని స్వీకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం-హరేకృష్ణ చారిటబుల్‌ ట్రస్టు పౌండేషన్‌ ద్వారా మూడు నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించి వారి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ట్రస్టుతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆహార భద్రత కల్పించే కార్యక్రమాలను చేపడుతోంద న్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి మార్గదర్శకత్వంలో మొదట కొడంగల్‌ నియోజకవర్గంలో విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకం అమలుతో విద్యార్థుల హాజరు 21 శాతం పెరిగిందన్నారు. విద్యా ర్థులకు రోజూ విభిన్న రకాల అల్పాహారం అందించేలా మెనూ రూపొందించామన్నారు. వారంలో 3సార్లు విద్యా ర్థులకు పాలు అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తు న్నామన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభు త్వం అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. యేటా వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నారని, ఈ పరిస్థితిని మార్చేందుకు అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సీఎం విదేశీ పర్యటన చేపట్టాలని భావించారని చెప్పారు. గుజరాత్‌ ముఖ్య మంత్రికి అవకాశం ఇచ్చి, తెలంగాణ ముఖ్యమంత్రికి ఎందుకు అను మతి ఇవ్వలేదో అర్థం కావడం లేదన్నారు. పార్టీలో జరుగుతున్న తాజా రాజకీయ పరి ణామాలు, పరస్పర ఆరోపణలపై క్రమశిక్షణ సంఘం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందన్నారు.

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచనల మేరకు జిల్లాలో విద్యాశాఖకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహిం చిన అధ్యయ నాల ప్రకారం విద్యాశాఖకు సంబంధించి రాష్ట్రంలో 3వ స్థానంలో జిల్లా నిలిచిందన్నారు. అల్పాహార పథకం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, హాజరు, విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం, విద్య ఉచితంగా అందుతున్నందున తల్లిదండ్రులు ఎలాం టి సందేహాలు లేకుండా పిల్లలను ప్రభుత్వ పాఠశా లల్లో చేర్పించాలన్నారు. ఆర్డీవో సురేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ వొడ్నాల సహేందర్‌ రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ వెంకన్న, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, తహసీల్దార్‌ ఆరిఫోద్దిన్‌, అధికారులు, ట్రస్టు నిర్వాహకులు, పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 11:41 PM