Share News

రామగుండం నవ నిర్మాణమే లక్ష్యం

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:18 PM

రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగు తున్నామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠా కూర్‌ అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పేదల సంక్షేమానికి సమప్రాధాన్యం ఇస్తున్న ట్లు తెలిపారు.

రామగుండం నవ నిర్మాణమే లక్ష్యం

జ్యోతినగర్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగు తున్నామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠా కూర్‌ అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పేదల సంక్షేమానికి సమప్రాధాన్యం ఇస్తున్న ట్లు తెలిపారు. మంగళవారం ఎన్‌టీపీసీలోని కాకతీయ ఆడిటోరియంలో 1100 మంది లబ్ధి దారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీ డింగ్‌ పత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యం తో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. సొంతిల్లు కల్పించడం ద్వారా పేదలకు భద్రత, భరోసా కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. మొదటి విడతలో ఇళ్లు మంజూరు కాని అర్హులకు రెండో విడతలో అవకాశం కల్పించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

రామగుండం నియోజకవర్గంలో రహదా రులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని రాజ్‌ఠాకూర్‌ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పట్టణాభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రాధాన్య మిస్తోందన్నారు. రామగుండాన్ని పారిశ్రామి కంగా మరింత అభివృద్ధి చేయడంతోపాటు ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అం దేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతపల్లి ఎల్లయ్య, కమిషనర్‌ అరుణశ్రీ, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముస్తఫా, కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 11:18 PM