గడపగడపకు ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:11 AM
ప్రభుత్వ పథకాలు గడప గడపకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం 47వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను మేయర్ ప్రజలకు వివరించారు.
కోల్‌సిటీ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలు గడప గడపకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం 47వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను మేయర్ ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ వెయ్యి రోజుల పాలనను 99రోజుల్లో కార్పొరేషన్‌లో ప్రతి వార్డుకు వార్డు సందర్శన చేసి అన్నీ డివిజన్‌లలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేశామని, మిగిలిన అభివృద్ధి పనులను త్వరలోనే చేస్తామన్నారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ రామగుండం అభివృద్ధికి రూ.800కోట్లు తీసుకువచ్చి ప్రతి డివిజన్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. దసరా నుంచి చేయూత పెన్షన్లు అర్హులం దరికి అందిస్తామని చెప్పారు. ఇందిరమ్మ కుట్టుమిషన్లు అందిం చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. కార్పొరేటర్లు ఎండీ ముస్తాఫా, సిరి శెట్టి సతీష్, నాయకులు కొక్కిరాల శ్రీనివాస్, కంజపురం రాజేందర్, సదానందం, సురేందర్, రవి, బెంద్రం నాగభూషణం, పోషం, లింగయ్య, పాల్గొన్నారు.