Share News

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:08 AM

మహిళలను కోటీశ్వ రులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నో కార్యక్ర మాలు చేపట్టిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరిం చుకొని శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మహిళలను సన్మానించారు.

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

పెద్దపల్లిటౌన్‌, మార్చి 7 (ఆంఽధ్రజ్యోతి): మహిళలను కోటీశ్వ రులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నో కార్యక్ర మాలు చేపట్టిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరిం చుకొని శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మహిళలను సన్మానించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 10 లక్షల రూపాయలతో మున్సిపల్‌ కొనుగోలు చేసిన మూడు ట్రాక్టర్‌ ట్రాలీలను ప్రారంభించారు. అనం తరం రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 40 లక్షల రూపాయలతో 26 మంది దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అనే నినాదంతో ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా పని చేస్తున్నారన్నారు. కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌. మున్సిపల్‌ చైర్మన్‌ నుగిళ్ళ మల్లన్న, వైస్‌ చైర్‌పర్సన్‌ ముస్కాన్‌ నాజ్‌, కౌన్సిలర్లు, వ్యవ సాయ మార్కెట్‌ చైర్మన్‌, కూర మల్ల రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్‌, మున్సిపల్‌ అధికారులు, మెప్మా మహిళలు, కౌన్సిలర్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 12:08 AM