దీక్షా దివస్ సభ విజయవంతమే లక్ష్యం
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:07 AM
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష స్ఫూర్తిని ప్రజలకు, యువతకు తెలియజేసే లక్ష్యంతో ఈనెల 29న అలుగునూరు చౌరస్తా సమీపంలో నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి సభకు రామగుండం నియోజకవర్గం నుంచి వేలాది మం దిని తరలించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్య క్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు.
గోదావరిఖని, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష స్ఫూర్తిని ప్రజలకు, యువతకు తెలియజేసే లక్ష్యంతో ఈనెల 29న అలుగునూరు చౌరస్తా సమీపంలో నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి సభకు రామగుండం నియోజకవర్గం నుంచి వేలాది మం దిని తరలించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్య క్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. బుధవారం ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో సభకు సంబంధించిన కార్యాచరణను వివరించారు. కేసీఆర్ అలుగునూరు చౌరస్తా వద్ద అరెస్టుకు గురై ఆమ రణ నిరాహార దీక్ష చేపట్టారని, ఆ దీక్షకు మద్దతుగా విద్యార్థులు, యువత, ప్రజలు పార్టీలకు అతీతంగా ఉద్యమంలో భాగస్వాములయ్యారని పేర్కొ న్నారు. డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రక టన చేయడం ఉద్యమంలో కీలక పరిణామమన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో అలుగునూరు చౌరస్తా సమీపంలో భారీ దీక్షా దివస్ స్ఫూర్తి సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభ అనం తరం తెలంగాణ అమరవీరుల జ్యోతి వరకు స్ఫూర్తి మహాపాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దీక్ష దివస్ స్ఫూర్తి సభకు నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, యువత తరలిరావాలని పిలుపునిచ్చారు.