Share News

స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:49 PM

స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ పాలకవర్గం పని చేస్తుందని మేయర్‌ మహంకాళి స్వామి పేర్కొన్నారు. ప్రగతి ప్రణాళిక శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ఆఖరి రోజున ఆదివారం సండే ఫన్‌ డే థీమ్‌తో గోదావరిఖని పుష్కర ఘాట్‌ వద్ద నిర్వహించారు.

స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

కోల్‌సిటీ, మార్చి 15(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ పాలకవర్గం పని చేస్తుందని మేయర్‌ మహంకాళి స్వామి పేర్కొన్నారు. ప్రగతి ప్రణాళిక శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ఆఖరి రోజున ఆదివారం సండే ఫన్‌ డే థీమ్‌తో గోదావరిఖని పుష్కర ఘాట్‌ వద్ద నిర్వహించారు. సీడీఎంఏ కార్యాలయం నుంచి జాయింట్‌ డైరెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) అరుణశ్రీ, డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్యలు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ మహంకాళి స్వామి, జేడీ వేణుగోపాల్‌రెడ్డి, కమిషనర్‌ అరుణశ్రీ, కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బంది నదిలో పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలను ఆచరించేందుకు రామగుండంకు రానున్నారని, ఎమ్మెల్యేరాజ్‌ ఠాకూర్‌ ఆధ్వర్యంలో రూ.150కోట్లతో నిధులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ మేరకు డీపీఆర్‌ కూడా సిద్ధమవుతుందన్నారు. జాయింట్‌ డైరెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ గోదావరి నది తీరంలో ప్రతి నెల ఒక సారి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి వ్యర్థాలను తొలగించాలన్నారు. నదిలో వ్యర్థాలు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 99రోజుల కార్యాచరణ ప్రణాళిక నగరంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండానికి కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బంది పాలు పంచుకుంటున్నారన్నారు. నదిలో తొలగించిన వ్యర్థాలను డంపింగ్‌యార్డుకు తరలించారు. లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు రాజేందర్‌, సారయ్య ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొన్న సిబ్బందికి అల్పాహారం అందజేశారు. అనంతరం నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో జాయింట్‌ డైరెక్టర్‌, మేయర్‌ స్వామి, అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్పొరేషన్‌ కార్యాయలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సప్తగిరికాలనీలోని ఎస్‌సీ, బీసీ సోషల్‌ వెల్ఫేర్స్‌ హాస్టల్స్‌లో విద్యార్థులకు ప్లాస్టిక్‌ నిషేధం, తడి, పొడిచెత్తపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీ వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర, ఈఈ పీవీ రామన్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌ఓ ఆంజనేయులు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్‌ నవీన్‌, సూపరింటెండెంట్‌ పబ్బాల శ్రీనివాస్‌, మెప్మా టీఎంసీ మౌనిక, కార్పొరేటర్లు మౌనిక, ఫజల్‌ బేగ్‌, సాంబమూర్తి, వడ్లూరి రవి, సత్యప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 11:49 PM