Share News

పట్టణాన్ని సుందరీకరణ చేయడమే లక్ష్యం

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:35 AM

రామగుండం అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్యవర్గాల పాత్ర కీలకమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ అన్నారు. శుక్రవారం అడ్డగుంటపల్లిలోని కెమిస్ర్టి భవన్‌లో వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పట్టణాన్ని సుందరీకరణ చేయడమే లక్ష్యం

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రామగుండం అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్యవర్గాల పాత్ర కీలకమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ అన్నారు. శుక్రవారం అడ్డగుంటపల్లిలోని కెమిస్ర్టి భవన్‌లో వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలో జరు గుతున్న అభివృద్ధి పనులను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గోదావరిఖని అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్య వర్గాల పాత్ర కీలకమని, వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించేలా వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతీ వర్గాన్ని భాగస్వామం చేస్తూ ముందుకు సాగుతున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, అభివృద్ధి, పారిశుధ్యం, పట్టణ సుందీకరణ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. గోదావరిఖని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి వ్యాపారుల అభివృద్ధికి తోడ్పాటునందిస్తానన్నారు. మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:35 AM