గ్రామాల అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:57 PM
మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తానని ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. వెంకట్రావుపల్లిలో సోమవారం ఎమ్మెల్యే పాఠశాల ప్రహరీకి రూ.10 లక్షలు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.10లక్షలు, స్వశక్తి మహిళా భవన నిర్మాణానికి రూ.10లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
జూలపల్లి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తానని ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. వెంకట్రావుపల్లిలో సోమవారం ఎమ్మెల్యే పాఠశాల ప్రహరీకి రూ.10 లక్షలు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.10లక్షలు, స్వశక్తి మహిళా భవన నిర్మాణానికి రూ.10లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామ శివా రులో నుంచి కాచాపూర్ వరకు చేప ట్టిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే అధికారులతో కలిసి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ అభి వృద్ధి పనుల్లో నాణ్యత పాటించేలా అధికారులు పనిచేయాలని సూచిం చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల మేలుకోరి పనిచేస్తున్నామన్నారు. సర్పంచ్ మచ్చ అరుణ, యాదగిరి పెద్దపల్లి మున్సిపాల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, పార్టీ మండల అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాస్, నాయకులు పుల్లూరి వేణుగోపాల్‌రావు, దుగ్యాల శ్యాంరావు, మారుపాక కుమార్, మల్లెత్తుల కొమురయ్య, కనుకుంట్ల అంజయ్య, ఈర్ల స్వామి, లింగయ్య, హరికృష్ణ, పెంట కిశోర్, లింగయ్య, రాజేశ్వర్, వేల్పుల లింగయ్య పాల్గొన్నారు.