Share News

రైతు సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:01 AM

నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పని చేస్తున్నానని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు. గురువా రం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

రైతు సంక్షేమమే లక్ష్యం

కాల్వశ్రీరాంపూర్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పని చేస్తున్నానని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు. గురువా రం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రెండున్నరేళ్లలో ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంలో రైతు లకు ఇబ్బంది కలగకుండా, గింజ కట్టింగ్‌ లేకుండా కొనుగోలు చేశామన్నారు. కోట్ల రూపాయలతో గ్రామా ల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. సర్పం చ్‌లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చుతూ గ్రామాభివృద్ధికి కృషి చేయాల న్నారు. తాను వచ్చిన తర్వాత రైతులకు గుంట ఎం డకుండా నీటిని అందించామన్నారు. ఆయా శాఖల అధికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో పని చేయా లని సూచించారు. నియోజకవర్గంలో విద్యుత్‌ సమ స్యలు తీర్చేందుకు రూ.10.80 కోట్ల ప్రతిపాదనలు పం పగా ఐదు కోట్లు మంజూరయ్యాయని, మిగిలిన డబ్బులు త్వరలో మంజూరవుతాయన్నారు. 40 ఏళ్ల క్రితం ఇక్కడ 30 పడకల ఆసుపత్రి కడితే గత ప్రభుత్వం దాన్ని ఆరుపడకలకు చేసిందని, 30 పడ కల ఆసుపత్రితోపాటు భవనం మంజూరుకు కృషి చేస్తానన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్‌ స్థాయిలో సౌకర్యం కల్పించామన్నారు. మండలంలో పాఠశాలల అభివృద్ధికి రూ.7.54 కోట్లు మంజూరు చేశామన్నారు. జిల్లా విద్యారంగంలో రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధి, ఇతర పనుల అభివృద్ధికి కలెక్టర్‌ చేసిన కృషితో వారికి అవార్డు వచ్చినట్లు పేర్కొన్నారు. మండలంలో 108 సేవలు కల్పిస్తామని, వచ్చే మండల సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో సభకు రావాలని ఆదేశించారు. రైతులకు రావాల్సిన గన్ని సంచుల డబ్బులు త్వరలో వారి ఖాతాల్లో పడుతాయని హామీ ఇచ్చారు. మండల స్పెషల్‌ అధికారి శ్రీమాల, డీఎల్‌ పీవో దేవకీదేవి, పీఆర్‌ ఏడీ రమణారెడ్డి, సూప రింటెండెంట్‌ శ్రీధర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రంగు రవి, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 12:01 AM