పర్యావరణ పరిరక్షణే లక్ష్యం..
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:35 AM
: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ-వ్యర్థాలపై అవగాహన పెంపొందించడంతో పాటు వాటిని సేకరించి, సురక్షితంగా తొలగించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో ఏకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్‌లో భాగంగా స్పెషల్ క్యాంపెయిన్-6 కింద ఈ-వేస్ట్‌పై అవగాహన, సేకరణ, బాధ్యతయుత తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ పీవీ శ్రీహరి ఆయా జిల్లాల డీఈవోలను ఆదేశించారు.
జగిత్యాల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ-వ్యర్థాలపై అవగాహన పెంపొందించడంతో పాటు వాటిని సేకరించి, సురక్షితంగా తొలగించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో ఏకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్‌లో భాగంగా స్పెషల్ క్యాంపెయిన్-6 కింద ఈ-వేస్ట్‌పై అవగాహన, సేకరణ, బాధ్యతయుత తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ పీవీ శ్రీహరి ఆయా జిల్లాల డీఈవోలను ఆదేశించారు. ఈ-వేస్ట్‌లో భాగంగా వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, శానిటరీ వేస్ట్, స్పెషల్ కేర్ వేస్ట్‌లను వేర్వేరుగా సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది.
ఫవిద్యార్థుల భాగస్వామ్యం తప్పనిసరి
ప్రతి విద్యార్థి కనీసం ఒక అర్హత కలిగిన, ప్రమాదకరం కాని ఎలకా్ట్రనిక్, ఎలకా్ట్రనికేతర వ్యర్థ వస్తువును సేకరించేలా ప్రోత్సహించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల అనుమతితో ఇంటి నుంచి కూడా ఇలాంటి వస్తువులను తీసుకొని రావచ్చు. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, ఏకోక్లబ్ ఇన్‌చార్జి ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది.
ఫ28న ప్రత్యేక సేకరణ దినోత్సవం..
ప్రత్యేక ఈ-వ్యర్థాల సేకరణ, బాధ్యతాయుత తొలగింపు దినోత్సవాన్ని ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నారు. అదే రోజు ఉదయం ప్రార్థనా సమయంలో ఈ-వ్యర్థాల నిర్వహణపై అవగాహన సదస్సుతో పాటు కేంద్ర ప్రభుత్వం సూచించిన క్విజ్ నిర్వహించనున్నారు కార్యక్రమానికి సంబంధించి నిమిషం నిడివి గల వీడియో, ఫొటోలను పాఠశాలల్లో సిద్ధం చేసి నిర్దేశించిన విధంగా భద్రపరుస్తున్నారు.
ఫఅధీకృత రీసైక్లర్లకే అప్పగింత..
సేకరించిన ఈ-వ్యర్థాలను మండల స్థాయిలో ఒక చోటు చేర్చనున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీఆర్‌బీ) లేదా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎస్‌పీసీబీ) నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన అధీకృత రీసైక్లర్లకు లేదా పునరుద్ధరణ సంస్థలకు మాత్రమే అప్పగించనున్నారు. ఈ ప్రక్రియలో వస్తువుల వారీగా వివరాలు, అప్పగింత రసీదులను నిర్వహించాల్సి ఉంటుంది. అనధికార స్ర్కాప్ వ్యాపారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ-వ్యర్థాలను అప్పగించకూడదని మార్గదర్శకాల్లో సూచించారు.
ఫయూడైస్‌లో వివరాలు..
పాఠశాలలు సేకరించిన ఈ-వ్యర్థాల వివరాలను కిలో గ్రాముల్లో మాత్రమే కాకుండా వస్తువు పేరు, రకం, సంఖ్య రూపంలో అధికారిక పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. పాఠశాల యూడైస్ (యూడీఐఎస్‌ఈ) గుర్తింపు సంఖ్యతో వివరాలను అప్‌లోడ్ చేయనున్నారు. క్విజ్ నిర్వహణ, అధీకృత సంస్థలకు వ్యర్థాలను అప్పగింత, పాల్గొన్న విద్యార్థుల సంఖ్య, జియోట్యాగ్ చేసిన రెండు నుంచి మూడు ఫొటోలను కూడా పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఫపాఠశాలల్లో నాలుగు రకాల డస్ట్‌బిన్‌ల ఏర్పాటు..
పాఠశాలల్లో పనికిరాని ఈ-వేస్ట్ వస్తువులను వేయడానికి నాలుగు రంగుల్లో నాలుగు డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేయనున్నారు. పండ్లు, కూరగాయలు, పనికి రాని ఆహార పదార్థాలు, కిచెన్ వేస్ట్ వంటి వెట్ వేస్ట్ వేయడానికి గ్రీన్ కలర్ బిన్, పేపర్, కార్డ్‌బోర్డు, ప్లాస్టిక్ ఐటమ్స్, గ్లాస్ బాటిళ్లు వంటి డ్రై వేస్ట్‌ను వేయడానికి బ్లూకలర్ బిన్, యూజుడ్ డైపర్స్, శానిటరీ ప్యాడ్స్, బ్యాంగిల్, డ్రెస్సింగ్స్ వంటి శానిటరీ వేస్ట్‌ను వేయడానికి రెడ్ కలర్ బిన్, యూజుడ్ బ్యాటరీస్, ట్యూబ్ లైట్స్, పేయింట్ కాంటేనరీ వంటి స్పెషల్ కేర్ వేస్ట్‌ను వేయడానికి బ్లాక్ కలర్ బిన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
విద్యార్థులు భాగస్వాములు కావాలి
-రాము, జిల్లా విద్యాశాఖ అధికారి
పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు ఎలకా్ట్రనిక్ వ్యర్థాలను బాధ్యతాయుతంగా సేకరించి, సురక్షితంగా తొలగించేందుకు విద్యార్థులు భాగస్వామ్యులు కావాలి. ఈనెల 28న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక ఈ-వ్యర్థాల సేకరణ, బాధ్యతాయుత తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహిం చాలి. మండల విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎకోక్లబ్ ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశాము. నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.
జిల్లాలోని పాఠశాలల వివరాలు..
-----------------------------------
ప్రభుత్వ పాఠశాలలు...810...విద్యార్థులు...67,394
ప్రైవేటు పాఠశాలలు...292...విద్యార్థులు...77,592
----------------------------------------------------
మొత్తం పాఠశాలలు....1,102...మొత్తం విద్యార్థులు...1,44,986
-------------------------------------------------