అభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:03 AM
గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా మని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం ర్యాకల్‌దేవుపల్లిలో ఉపాధి హామీ నిధులు రూ.20 లక్షలతో నిర్మిస్తున్న నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి భూమి పూజ చేశారు.
ఎలిగేడు, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా మని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం ర్యాకల్‌దేవుపల్లిలో ఉపాధి హామీ నిధులు రూ.20 లక్షలతో నిర్మిస్తున్న నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం రూ.5 లక్షలతో మరమ్మతులు చేసిన అంగన్‌వాడీ భవనాన్ని ప్రారం భించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. గ్రామంలో జరిగే అభివృద్ధి పనులు గ్రామస్థులు భాగస్వాములై, నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులను నిలదీయాలని కోరారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేయించుకుంటూ కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకువచ్చి పనులు చేయిం చుకునే బాధ్యత మీపై ఉందన్నారు. పెండింగ్ పనులతోపాటు మౌలిక, వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు మంచిగా పని చేయాలని ఉన్నతాధికా రుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రభుత్వం పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్ఠికాహారం అందించాలని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్య క్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర యువజన కార్య దర్శి దుగ్యాల సంతోష్‌రావు, సర్పంచ్ మద్దెల రమా దేవి సంపత్, ఉపసర్పంచ్ కృష్ణ, తహసీల్దార్ యాక య్య, ఎంపీడీవో భాస్కర్‌రావు, సర్పంచ్‌లు కప్పల ప్రవీణ్, సిద్ది తిరుపతి, వెంకటేష్, వెంకట్ రెడ్డి, లత, కొమురయ్య, బాపయ్య, గోపు రజిత, రామిడి శైలజ, దుగ్యాల వాణి, గంగ జామున పాల్గొన్నారు.