పోలియోరహిత తెలంగాణే లక్ష్యం
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:35 PM
పోలియోరహిత తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, పోలియో చుక్కలు చిన్నారికి రక్షణ అని ఎమ్మెల్యే, విప్ చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
పెద్దపల్లిటౌన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): పోలియోరహిత తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, పోలియో చుక్కలు చిన్నారికి రక్షణ అని ఎమ్మెల్యే, విప్ చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదు సం వత్సరాలలోపు ఉన్న ప్రతీ చిన్నారికి విధిగా పోలియోచుక్కలు వేయించాలని కోరారు. పిల్లల ఆరోగ్యం మనందరి బాధ్యత అని పల్స్ పోలియో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ రాష్ట్రంలో అగ్ర గామిగా నిలిచి పలు అవార్డులు సాధించిందని, ప్రజలందరూ ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలకు ఆధునీకరణ చేస్తూ త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్, పెద్దపల్లి మున్సిపల్ ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య, వైస్ చైర్మన్ ముస్కాన్ నాజ్ నయ్యర్, ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీధర్ కౌన్సిలర్ కొట్టే స్వరూప, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.