Share News

బహుజన రాజ్యమే లక్ష్యం

ABN , Publish Date - May 02 , 2026 | 12:02 AM

బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విబ్రాం శేఖర్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, పాలకులు మారినా అణగారిన వర్గాల తలరాతలు మారలేదన్నారు.

బహుజన రాజ్యమే లక్ష్యం

పెద్దపల్లిటౌన్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విబ్రాం శేఖర్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, పాలకులు మారినా అణగారిన వర్గాల తలరాతలు మారలేదన్నారు. పార్టీలు, పాలకులు మారినా దళితులు, బహుజనుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగినట్లుగానే నేటికీ దళితులపై దాడులు, అత్యాచారాలు కొనసాగుతున్నాయని, బహుజనుల కష్టాలు తీరాలంటే రాజ్యాధికారం సాధించడం తప్ప మరో మార్గం లేదని, ఆ దిశగా కార్యకర్తలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. వరికిల్లా మల్లేష్‌, నర్ల గోపాల్‌ యాదవ్‌. నక్క తిరుపతి, పులిపాక బొంద్యాలు, అనిత, సిపెల్లి కొమురయ్య, బొంకురి దుర్గయ్య, భూమయ్య, మల్లారపు రవి. రామిళ్ల శారద, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 12:02 AM