Share News

యువ కార్మికుల చేతుల్లోనే సింగరేణి భవిష్యత్తు

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:16 AM

సింగరేణి సంస్థ భవిష్యత్తు యువ కార్మికుల చేతుల్లోనే ఉన్నదని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కమ్యూనిటీహాల్‌లో ఆర్జీ-2 ఏరియా యువ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

యువ కార్మికుల చేతుల్లోనే సింగరేణి భవిష్యత్తు

యైుటింక్లయిన్‌కాలనీ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ భవిష్యత్తు యువ కార్మికుల చేతుల్లోనే ఉన్నదని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కమ్యూనిటీహాల్‌లో ఆర్జీ-2 ఏరియా యువ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. సింగరేణిలో జరుగుతున్న పరిణామాలు, కార్మికుల హక్కుల హరించి వేస్తున్న తీరు, గెలిచిన సంఘాల వైఫల్యాలపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నట్టు పేర్కొన్నారు. అనేక హామీలను ఇచ్చి గెలిచిన యూనియన్లను హామీల అమలుపై ప్రశ్నించాలన్నారు. యువత ఏకమై హక్కుల కోసం, సంస్థ భవిష్యత్తు కోసం పోరాడితేనే సింగరేణిని కాపాడుకోగలమని ఆన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం, అవినీతిపై ప్రశ్నిస్తున్న టీబీజీకేఎస్‌ మీద గెలిచిన సంఘాలు ఎదురు దాడి చేస్తున్న తీరుపై ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. విద్యావంతులు, ఆధునిక పరిజ్ఞానం ఉన్న యువత సంస్థలో పని చేస్తుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. టీబీజీకేఎస్‌ హయాంలో మెడికల్‌ బోర్డు, ఎక్స్‌టర్న ల్‌ నోటిఫికేషన్ల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు మెడికల్‌ బోర్డులో మెజారిటీ కార్మికులను ఇన్వాలిడేషన్‌ అయ్యేలా చేసిన ఘనత టీబీజీకేఎస్‌కు దక్కుతుందన్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసు రామ్మూర్తి, ఆర్జీ-2 వైస్‌ ప్రెసిడెంట్‌ అయిలి శ్రీనివాస్‌, నాయకులు ఐ సత్యం, ప్రభాకర్‌రెడ్డి, చెల్పూరి సతీష్‌, రవీందర్‌రెడ్డి, కర్క శ్రీనివాస్‌, మామిడి తిరుపతి, అనిల్‌రెడ్డి, హరిప్రసాద్‌, మహేందర్‌, వెంకటేష్‌, రమేష్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2026 | 12:16 AM