ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్య సాధనలో ముందుండాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:37 PM
ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల భాషా, గణిత నైపుణ్యాలను పెంపొందించడంలో జిల్లా ముందంజలో నిలవా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం ఎంబీ గార్డెన్‌లో నిర్వ హించిన ఎఫ్‌ఎల్‌ఎన్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రొజెక్టర్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, ఏప్రిల్ 17 (ఆంఽధ్రజ్యోతి): ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల భాషా, గణిత నైపుణ్యాలను పెంపొందించడంలో జిల్లా ముందంజలో నిలవా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం ఎంబీ గార్డెన్‌లో నిర్వ హించిన ఎఫ్‌ఎల్‌ఎన్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రొజెక్టర్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలను ఎఫ్‌ఎల్ ఎన్ ఛాంపియన్ పాఠశాలలుగా ఎంపిక చేసి ప్రశంస పత్రాలు అందజే శారు. అనంతరం మాట్లాడుతూ, బేస్‌లైన్, మిడ్‌లైన్, ఎండ్‌లైన్ పరీక్షల ఫలితాలను విశ్లేషించి, విద్యార్థుల అభ్యాసన స్థాయిని నిరంతరం మెరు గుపరచాలని సూచించారు.
మండలాల వారీగా ఫలితాలను సమీక్షిస్తూ, లోపాలు ఉన్న చోట ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందస్తుగా ప్రణాళికలు రూపొందించి, ప్రతి విద్యార్థి ప్రాథమిక నైపుణ్యాలు, రీడింగ్ కాంప్రెన్షన్ సామర్థ్యాలను పెం పొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. గడ్డం జగ దీశ్వర్, ఆర్ కిరణ్, కృష్ణారెడ్డి, రవి, ప్రభాకర్‌రెడ్డి, దేవేందర్ రెడ్డి, పుష్పలత తదితరులకు కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు. కలెక్టర్ సూపర్ సమ్మర్ క్యాంప్ వీడియోను ఆవిష్కరించారు. జిల్లా విద్యాధికారి జి శారద, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ పిఎం షేక్, అలోక్ ప్రాజెక్టు సీఈఓ ప్రమోద్, ప్రతినిధి సమీద్ అహ్మద్, జిల్లాలోని ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, రిసోర్స్ టీం పాల్గొన్నారు.