Share News

మహనీయుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:44 PM

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్‌ నెలలో జరిగే మహనీయుల జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ వేణు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 5న బాబు జగ్జీవన్‌ రాం జయంతి, 14న అంబేద్కర్‌ జయంతి అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

మహనీయుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

పెద్దపల్లి కల్చరల్‌, మార్చి31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్‌ నెలలో జరిగే మహనీయుల జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ వేణు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 5న బాబు జగ్జీవన్‌ రాం జయంతి, 14న అంబేద్కర్‌ జయంతి అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా మహనీయుల జీవిత చరిత్ర, వారు సమాజానికి చేసిన సేవలను నేటి తరానికి చాటి చెప్పేలా విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. కరపత్రాలు, గోడ పత్రికల ముద్రణతోపాటు ప్రధాన కూడళ్లలో విగ్రహాల అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి మండల రవీందర్‌, వివిధ దళిత కుల సంఘాల నాయకులు, సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 11:44 PM