Share News

జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:01 AM

ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని అఖిల భారత రైతుకూలి సంఘం ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకులు గుండేటి మల్లేశం, మేరుగు చంద్రయ్యలు డిమాండ్‌ చేశారు.

జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

అంతర్గాం, నవంబరు24(ఆంధ్రజ్యోతి):ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని అఖిల భారత రైతుకూలి సంఘం ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకులు గుండేటి మల్లేశం, మేరుగు చంద్రయ్యలు డిమాండ్‌ చేశారు. మంగళవారం పెద్దంపేట ఐకేపి సెం టర్‌, వరి, పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం మాట్లా డుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కరువు సహా య చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫా రసు ప్రకారం కనీస మద్దతు ధరను నిర్ణయించి గ్యారంటీ చట్టం చేయా లని, సమగ్ర రుణమాఫీ పథకం, 60 ఏండ్లుపైబడిన రైతులతోపాటు, కౌలు రైతులకు రూ.10 వేల పెన్షన్‌ అందజేయాలన్నారు. కొల్లూరి మల్లేష్‌, ఊపులేటి లింగయ్య, అరుమూళ్ళ దుర్గయ్య, కూరపాటి లక్ష్మీరాజాం, గాదె నారాయణ, పల్లె రాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 12:01 AM