Share News

సంక్షేమం, అభివృద్ధిలో జిల్లా ముందంజ

ABN , Publish Date - May 02 , 2026 | 11:34 PM

: సంక్షేమ అభి వృద్ధి కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే జిల్లా ముం దంజలో ఉందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. బందంపల్లి స్వరూప గార్డెన్‌లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డితో కలిసి పాల్గొన్నారు.

సంక్షేమం, అభివృద్ధిలో జిల్లా ముందంజ

పెద్దపల్లి టౌన్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ అభి వృద్ధి కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే జిల్లా ముం దంజలో ఉందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. బందంపల్లి స్వరూప గార్డెన్‌లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో డయాలసిస్‌, కార్డియాలజీ, 2 డి ఏకో వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలి పారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, వడ్డీరహిత రుణాలు, వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలులో ఎలాం టి కోతలు లేకుండా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. రైతులు పంట మార్పుపై దృష్టి పెట్టాలని, వరి, మొక్కజొన్నలతో పాటు ఇతర పంటలను పండించాలని సూచించారు. మార్క్‌ ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం రైతులకు మద్దతు ఇస్తోందని తెలిపారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభు త్వ మార్గదర్శకాల మేరకు 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, కొత్త రేషన్‌ కార్డులు, డైట్‌ చార్జీల పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, 5 వందలకు గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరా మహిళా శక్తి వడ్డీరహిత రుణాలు, సన్నబియ్యం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలులో ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రజల నుండి ఫీడ్‌బ్యాక్‌ సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వచ్చిన సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ప్రతీ సోమ వారం పురోగతికి అనుగుణంగా చెల్లింపులు జరుగుతు న్నాయని చెప్పారు. ఈనెల 6న వెంకట పద్మ ఫంక్షన్‌ హాల్‌లో మెగా జాబ్‌మేళా జరుగుతుం దని, సుమారు 100 కంపెనీలు పాల్గొని వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించను న్నట్లు తెలిపారు. ప్రజాప్రతిని ధులు ఈ సమాచారాన్ని విస్తృ తంగా ప్రచారం చేయా లని కోరారు. డీజిల్‌, పెట్రోల్‌ కొరతపై వస్తున్న వదంతులు అసత్యమని, జిల్లాలో తగినంత నిల్వలు ఉన్నా యని తెలిపారు. రోజూ స్టాక్‌ పర్యవేక్షిస్తూ, ప్రతి పెట్రోల్‌ బంక్‌పై నిఘా ఉంచినట్లు తెలిపారు. ప్రజలు అవసరానికి సరిపడా మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అన్నయ్య గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మల్లారెడ్డి, సుల్తానాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రకాష్‌, ఆర్డీఓ బి.గంగయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 11:34 PM