కూల్చిన పైలాన్‌ను పునరుద్ధరించాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:48 PM
గోదావరిఖని లేబర్ కోర్టు వద్ద ఉన్న పైలాన్‌ను కూల్చివేసిన చోటనే పునరుద్ధరణ చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెప్పారు. బుధవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
కళ్యాణ్‌నగర్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని లేబర్ కోర్టు వద్ద ఉన్న పైలాన్‌ను కూల్చివేసిన చోటనే పునరుద్ధరణ చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెప్పారు. బుధవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుం డం ప్రాంతంలో జరిగిన అభివృద్ధికి, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పైలాన్‌ను కక్ష పూరితంగా కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రామగుండం నగరాన్ని కేసీఆర్ పాలనలో అభివృద్ధి పథం లో నడిపించామని, కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేశా మని, అభివృద్ధి పనులకు సంబంధించిన గుర్తులను తొలగిస్తే భవిష్యత్ తరాలకు ఆ అభివృద్ధి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పోలీసులు అధి కార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత పాలకులు రామగుండం ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. గతంలో నిర్మించిన కట్టడాలను కూల్చి వేయడం సరైంది కాదని, ప్రజల్లో విద్వేషాలు సృష్టించడం, వివాదాలకు తావ్వివడం మినహా పాలకులు సాధిస్తున్నదని ఏమిటని ప్రశ్నించారు. కౌశిక హరి, కార్పొరేటర్లు మేకల సమ్మయ్య, మందల కిషన్‌రెడ్డి, నాయకులు మూల విజయారెడ్డి, తోకల రమేష్, అచ్చె వేణు, ఆముల నారాయణ, సత్యవతి, మురళీధర్‌రావు, పద్మజ, మారుతి, రామోజు మహేష్, నూతి తిరుపతి పాల్గొన్నారు.