కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:37 AM
ఎన్నికల సమయంలో మహి ళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ శుక్రవారం పెద్దపల్లి అంబేద్కర్ చౌరస్తాలో వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో మహి ళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ శుక్రవారం పెద్దపల్లి అంబేద్కర్ చౌరస్తాలో వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. ఆటాపాటలు, బతుకమ్మ పాటలతో నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.2500, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ల పెంపు, విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ హామీలు ఏమ య్యాయని ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా మని చెప్పి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయడం లేదని ఆరోపిం చారు. కేసీఆర్ హయాంలో మహిళలు, పిల్లల సంక్షేమానికి కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పెన్షన్లు అమలు చేశామని గుర్తుచేశారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ దాసరి మమతారెడ్డి మాట్లాడుతూ మహిళల ఓట్ల కోసం హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని విమర్శించారు. ఉప్పు రాజుకుమార్, మార్కు లక్ష్మణ్, పెంచాల శ్రీధర్, ముత్యాల రాజయ్య, మహిళలు, వృద్ధులు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): మహిళలకు హామీలు ఇచ్చి వెయ్యి రోజు లు గడిచినా వాటిని అమలు చేయడం లేదని, ఈ ప్రభుత్వానికి గుణపా ఠం చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపుని చ్చారు. సుల్తానాబాద్‌లో మహిళా సదస్సు, వంటావార్పు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతు మేనిఫెస్టోలో మహిళల కోసం ఇస్తామని చెప్పిన ఏ ఒక్క హమీ నెరవేర్చని ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. పారుపల్లి గుణపతి, సూర శ్యామ్, జూపల్లి సందీప్‌రావు, రాజమల్లయ్య, సర్పంచులు సట్టు ఉత్తమకుమారి, శైలజ, ఒజ్జ సంపత్, గుడుడుల సతీష్, కోడం అజయ్, ఫకీర్, చంద్రమౌళి, కూకట్ల గోపి, నరేందర్, అరుణ, మమత, జ్ఞానేశ్వరి, తిరుమల, సంపత్ పాల్గొన్నారు.
గోదావరిఖని, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే వరకు వదిలేది లేదని, కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా రూ.1,00,116 ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇచ్చే వరకు కాంగ్రెస్ నాయకులను కల్యాణ వేదికలపైకి రానివ్వవద్దని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. నాయకురాలు మూల విజయారెడ్డి నేతృత్వంలో గోదావరిఖని చౌరస్తాలో వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వ హించారు. చందర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని, వితంతుల, వికలాంగుల పెన్షన్ పెంచుతా మని మాట ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. కౌశిక్ హరినాథ్, నడిపెల్లి మురళీధర్ రావు, హరీష్ రెడ్డి, మహేష్, కర్క పద్మజ, రమేష్, కిషన్ రెడ్డి, నారాయణ, మేకల సమ్మన్న పాల్గొన్నారు.
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రంథాలయ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్, పార్టీ మండల బాద్యులు మల్లేశం, మార్కె ట్‌కమిటీ మాజీ చైర్మన్ అనిల్, ఎంపీపీ వెంకటేశం, సర్పంచులు శ్రీనివాస్, సంపత్‌కుమార్, సంకెండ్ల లక్ష్మినర్సయ్య, అంకూస్, శ్రీనివాస్ పాల్గొన్నారు.