Share News

‘తారు’ లేచిపోతోంది...

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:50 PM

కొల నూర్‌ సమ్మక్క, సారలమ్మ బీటీ రోడ్డు మూ ణ్నాళ్ళ ముచ్చటగా మారుతోంది. సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు సౌకర్య వంతంగా ఉండేందుకు కొలనూర్‌ ఆర్‌అండ్‌బి రోడ్డు నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు రూ.95 లక్షలు వెచ్చించి బీటీ రోడ్డును నిర్మించారు.

‘తారు’ లేచిపోతోంది...

ఓదెల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): కొల నూర్‌ సమ్మక్క, సారలమ్మ బీటీ రోడ్డు మూ ణ్నాళ్ళ ముచ్చటగా మారుతోంది. సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు సౌకర్య వంతంగా ఉండేందుకు కొలనూర్‌ ఆర్‌అండ్‌బి రోడ్డు నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు రూ.95 లక్షలు వెచ్చించి బీటీ రోడ్డును నిర్మించారు. రోడ్డు నిర్మాణంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. అయితే నిర్మాణంలో నాణ్యత లోపం బయటపడుతోంది. జనవరిలో కేవలం 25 రోజుల్లోనే కాంట్రాక్టర్‌ నామమా త్రంగా రోడ్డు నిర్మించి చేతులు దులుపుకు న్నారు. జాతర పూర్తయి మూడు నెలలు కాకముందే రోడ్డుపై పోసిన తారు లేచిపో తోంది. కాంట్రాక్టర్‌ నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడు తుందని రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ లేకపోడంతో తారు లేచిపోయి నెర్రెలు ఏర్పడుతున్నాయని గ్రామ స్థులు పేర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణ సమ యంలో వాటర్‌ క్యూరింగ్‌ చేయలేదని ఆరోపి స్తున్నారు. జాతర సమయం దగ్గర పడడం తో హడావుడిగా పనులు చేశారని ఆరోపిస్తు న్నారు. ధన గుట్ట చుట్టూ ఉన్న పొలాలకు రైతులు నిరంతరం వెళుతుంటారు. రోడ్డుకిరు వైపులా ఉన్న మట్టి పక్కనున్న పొలాల్లోకి జారుతుందని, దీంతో వరి పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పండ్ల చెట్లు ధ్వంసం

సమ్మక్క, సారలమ్మ జాతరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ఉపాధిహామీలో నాటిన పండ్ల చెట్లను ధ్వంసం చేశారు. రోడ్డు నిర్మాణం చేసే ముందు కాంట్రాక్టర్‌ అధికారుల అనుమతితో ప్రభుత్వానికి పన్ను చెల్లించి మట్టిని తవ్వాలి. పంచాయతీరాజ్‌, మైనింగ్‌ శాఖ నుంచి అను మతులు లేకుండానే ధనగుట్ట వద్ద కమ్యూ నిటీ ప్లాంటేషన్‌ కింద నాటిన పండ్ల, టేకు, తదితర విలువైన మొక్కలను ధ్వంసం చేసి మట్టి తరలించి బొందల దిబ్బగా మార్చారు. పెద్దపెద్ద రాళ్లను, చెట్లను తొలగించి గుట్ట చుట్టూ మట్టిని తవ్వుకొని రోడ్డుకు ఉపయో గించారు. ధన గుట్ట సమీపంలో 2023 జూన్‌ 29న కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో భాగంగా పం డ్లు, టేకు మొక్కలను ఉపాధిహామీలో నాటా రు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండ రోడ్డు నిర్మించినట్లు గ్రామస్థుల నుంచి ఆరోప ణలు వ్యక్తమవుతున్నాయి.

మట్టి తరలింపు తెలియదు

- పవన్‌, పీఆర్‌ ఏఈ

ధన గుట్ట కింది వైపు నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలపై పంచాయతీరాజ్‌ ఏఈ పవన్‌ను వివరణ కోరగా బీటీ రోడ్డుకు పోసిన మట్టి విషయంలో ఎక్కడి నుంచి మట్టి తెచ్చినా డబ్బులు కట్టాలి. ధన గుట్టకు నుంచి మట్టిని తవ్వవచ్చు నాకు తెలియదు. రోడ్డు పనులు నిర్వహించేందుకు వాహనాలను నిలపడానికి మట్టిని తీయవచ్చు. ఆర్‌అండ్‌బి రోడ్డుకు ఆనుకొని ఉండటం వల్ల కొంత బీటీ లేచిపోవచ్చని వివరణ ఇచ్చారు.

Updated Date - Mar 21 , 2026 | 11:50 PM