Share News

కిక్కిరిసిన మల్లన్న ఆలయం

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:54 PM

భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం పెద్దపట్నం, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసి పోయాయి. ఆలయంలోని వీరభద్ర స్వామి క్షేత్రంలో ఆలయ చైర్మన్‌ చీకట్ల మొండయ్య, సభ్యులు, ఈవో సదయ్య సమక్షంలో పురోహితులు వీరభద్రారాధన నిర్వహించారు.

కిక్కిరిసిన మల్లన్న ఆలయం

ఓదెల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం పెద్దపట్నం, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసి పోయాయి. ఆలయంలోని వీరభద్ర స్వామి క్షేత్రంలో ఆలయ చైర్మన్‌ చీకట్ల మొండయ్య, సభ్యులు, ఈవో సదయ్య సమక్షంలో పురోహితులు వీరభద్రారాధన నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రధారణ నిర్వహించారు. ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, మంటపస్తాపన, వీరభద్రారాధన నిర్వహించారు. రాత్రి భద్రకాళి ఆవాహనం అనంతరం అర్ధ రాత్రి పెద్దపట్నం, అగ్నిగుండ ప్రజ్వలన నిర్వహించనున్నారు. సోమవారం తెల్లవారుజామున భక్తులు అగ్నిగుండం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జాతరకు వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలో ఉన్న భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు మూడు గంటల పాటు సమయం పట్టింది. వివిధ మండలాలు, జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు, ప్రజాప్రతినిధులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈవో సదయ్య, ఆలయ చైర్మన్‌ చీకట్ల మొండయ్య, సభ్యులు కొమురయ్య, మనోహర్‌ రావు, రవీందర్‌, సమ్మిరెడ్డి, శ్రీనివాస్‌, రాజారాం, శ్రీనివాస్‌, రవికుమార్‌, శ్రావణ్‌ కుమార్‌, రమేష్‌, యమున, ముఖ్య అర్చకుడు ధూపం వీరభద్రయ్యతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:54 PM