Share News

మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:59 PM

ప్రధా ని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచం దర్‌ రావు పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూని యర్‌ కళాశాల ఆవరణలో గురువారం నిర్వహిం చిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని ఆయన ప్రారం భించారు.

మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి

పెద్దపల్లి టౌన్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రధా ని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచం దర్‌ రావు పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూని యర్‌ కళాశాల ఆవరణలో గురువారం నిర్వహిం చిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని ఆయన ప్రారం భించారు. ఆయన మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్‌ అని, వారి శక్తి సామర్థ్యాలను సద్విని యోగం చేసుకుంటే దేశం మరింత బలమైన, అభి వృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, జాతీయ జెండా ప్రతీ భారతీయుడి ఆత్మగౌరవానికి, దేశభక్తికి, జాతీయఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ద్వారా దేశభక్తి స్ఫూర్తిని చాటాలని పిలుపుని చ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు. ప్రపం చంలోనే అత్యధిక యువకులు ఉన్న దేశంగా భారత్‌ ఉందన్నారు. యువత తమ ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించా లని సూచించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత్‌ను ప్రపం చంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవ స్థగా తీర్చిదిద్దే దిశగా పని చేస్తోందని, దేశంలో మౌలిక వసతులు, పరిశ్రమలు, సాంకే తిక రంగాలతో పాటు వివిధ రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మెడికల్‌ కళాశాలలు, యూని వర్సిటీలను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. అనం తరం 500 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు, యువత, బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది భద్రత చర్యలు చేపట్టారు. ఉపాద్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ జిల్లా అధ్య క్షుడు సంజీవరెడ్డి, గోమాస శ్రీనివాస్‌, సురేష్‌ రెడ్డి, కందుల సంధ్యారాణి, బల్మూరి వనిత, మీస అర్జున్‌ రావు, పల్లె సదానందం, రాజగోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 11:59 PM