Share News

సింగరేణిని ఏటీఎంలా మార్చుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:53 PM

సింగరేణి సంస్థ నిధులను వాడుకుంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకున్నట్టు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం యూనియన్‌ ఆఫీస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సింగరేణిని ఏటీఎంలా మార్చుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

యైుటింక్లయిన్‌కాలనీ, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ నిధులను వాడుకుంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకున్నట్టు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం యూనియన్‌ ఆఫీస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ సంస్థల నుంచి 56 వేల కోట్ల బకాయిలు ఇప్పించాల్సింది పోయి, సంస్థ నిధులను విచ్చలవిడిగా దారి మళ్ళిస్తుండడంతో ఆర్థికంగా దివాళా తీసే దుస్థితిని కల్పించినట్టు పేర్కొన్నారు. దేశంలోని ఏ పబ్లిక్‌ సెక్టార్‌కు కూడా ప్రభుత్వాలు బకాయిలు లేవని, కేవలం సింగరేణికి మాత్రమే ఈ దుస్థితి రావడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమన్నారు. కార్మికుల జీతాలు ఇవ్వడానికి, రోజు వారి ఖర్చులకు ఓడీ, బాండ్‌లు పెట్టి అప్పులు తేవాల్సిన పరిస్థితులు ఉన్నట్టు పేర్కొన్నారు. కొత్త టెక్సాలజీ, విడిభాగాలు, కొత్త మిషనరీ కొనుగోలుకు నిధులు లేవని అన్నారు. నైనీ బ్లాక్‌ నుంచి బొగ్గు తీసినా నిధులు లేని కారణంగా రవాణా మార్గం ఏర్పాటు చేయలేదని తెలిపారు. కార్మిక వాడలకు మంచి నీటి సరఫరా, మౌలిక సదుపా యాల ఏర్పాటుపై ప్రభావం పడుతుందన్నారు. సింగరేణి ఆర్థికంగా బలపడితే రాష్ట్ర ప్రభు త్వానికి పన్నుల రూపంలో ఆదాయం సమకూ రుతుందని తెలిపారు. నిధుల కొరతతో రెండేళ్ళ నుంచి డీఎంఎఫ్‌టీ నిధులు జమకాలేదన్నారు. సింగరేణి నిధులను రాష్ట్ర పభ్రుత్వం దారి మళ్ళించవద్దని, విద్యుత్‌ సంస్థల నుండి రావాల్సిన బకాయిలను ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. అయిలి శ్రీనివాస్‌, మేడిపల్లి సంపత్‌, దాసరి శ్రీనివాస్‌, ఎస్‌ఆర్సీ రెడ్డి, పల్లె శంకర్‌, రాంచందర్‌, రవి, జీవన్‌, నారాయణరెడ్డి, కుమారస్వామి పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 11:53 PM