Share News

ఉద్యోగుల సమష్టి కృషితోనే సంస్థ ప్రగతి

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:48 PM

ఎన్టీపీసీ రామగుండం 49వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం పరిపాలనా భవనం ఆవరణలో నిర్వహించారు. ఎన్టీపీసీ రామగుండం, తెలంగాణ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ప్రాజెక్ట్‌ హెడ్‌ ఫైజ్‌ తయ్యబ్‌, దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు తజీన్‌ జావెద్‌, తెలంగాణ సీఎంఓ, జీఎంలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమష్టి కృషితోనే సంస్థ ప్రగతి

జ్యోతినగర్‌, నవంబరు14(ఆంధ్రజ్యోతి): ఎన్టీపీసీ రామగుండం 49వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం పరిపాలనా భవనం ఆవరణలో నిర్వహించారు. ఎన్టీపీసీ రామగుండం, తెలంగాణ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ప్రాజెక్ట్‌ హెడ్‌ ఫైజ్‌ తయ్యబ్‌, దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు తజీన్‌ జావెద్‌, తెలంగాణ సీఎంఓ, జీఎంలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుగా ఫయాజ్‌ తయ్యబ్‌ ఎన్టీపీసీ జెండాను ఆవిష్కరించి గీతాన్ని ఆలపించారు. అతిథులకు స్వాగతం పలికిన అనంతరం కేక్‌ కట్‌ చేసి, బెలూన్లను గాలిలోకి వదిలి వేడుకలను నిర్వహించారు. ఎన్టీపీసీ కార్మిక సంఘ్‌, ఎన్టీపీసీ మజ్దూర్‌ యూనియన్‌, ఎన్టీపీసీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం, సీనియర్‌ ప్రతినిధులు ప్రసంగించి శుభాకాంక్షలు తెలిపారు. సెంట్రల్‌ ఎన్‌బీసీ సభ్యుడు బాబర్‌ సలీం పాషా, తెలంగాణ సీఎంఓ, రామగుండం జీఎం సంస్థ ప్రస్థానం, సాధించిన విజయాలను వివరించారు. ఈడీ ఫయాజ్‌ తయ్యబ్‌ మాట్లాడుతూ ఎన్టీపీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ ప్రస్థానంలో సాధించిన కీలక విజయాలు, నిర్వహణ, ఉత్పత్తి రంగాల్లో సాధించిన మైలురాళ్లు, సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలు, ఎన్టీపీసీ రామగుండం, తెలంగాణకు లభించిన గుర్తింపులను వివరించారు. సంస్థ అభివృద్ధిలో ఉద్యోగుల అంకితభావం, నిబద్ధత, సమష్టి కృషి కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ సంస్థను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2026 | 11:48 PM