కాళేశ్వరంను ఎడారిగా మార్చిన ముఖ్యమంత్రి
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:29 PM
నిండుకుండలా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎడారిలా మార్చిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం ఎండిన గోదా వరిలో క్రికెట్, అష్టచమ్మ ఆటలు ఆడి నిర సన తెలిపారు. చందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయినా కాళేశ్వరం ప్రాజెక్టులోని నీటిని వృథాగా సముద్రంలోకి వదులుతున్నారని, కృంగిన ప్రాజెక్టుకు ఎందుకు మరమ్మతులు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
గోదావరిఖని, మార్చి 22(ఆంధ్రజ్యోతి): నిండుకుండలా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎడారిలా మార్చిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం ఎండిన గోదా వరిలో క్రికెట్, అష్టచమ్మ ఆటలు ఆడి నిర సన తెలిపారు. చందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయినా కాళేశ్వరం ప్రాజెక్టులోని నీటిని వృథాగా సముద్రంలోకి వదులుతున్నారని, కృంగిన ప్రాజెక్టుకు ఎందుకు మరమ్మతులు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఉన్న కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడు తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని విమర్శిం చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రైతుల గోస తగులుతుందని, ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు నిర్వహించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి చిత్రపటం వద్ద పిండ ప్రదానం చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు ఐలయ్యయాదవ్, వెంకటి, తోకల రమేష్, కోడి రామకృష్ణ, బొడ్డుపెల్లి శ్రీనివాస్, రుషేద్రం పాల్గొన్నారు.