Share News

చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

ABN , Publish Date - Nov 27 , 2026 | 11:41 PM

కార్మికుల హక్కుల సాధనకు డిసెంబరు 1 నుంచి 3 వరకు ఢిల్లీలో నిర్వహించనున్న చలో ఢిల్లీ పార్లమెంట్‌ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్‌ పిలుపుని చ్చారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు

చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

పెద్దపల్లి టౌన్‌, నవంబరు 27 (ఆంధ్ర జ్యోతి): కార్మికుల హక్కుల సాధనకు డిసెంబరు 1 నుంచి 3 వరకు ఢిల్లీలో నిర్వహించనున్న చలో ఢిల్లీ పార్లమెంట్‌ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్‌ పిలుపుని చ్చారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సీపెల్లి రవీందర్‌ మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని, కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.42 వేలుగా నిర్ణయించాలని, కనీస పెన్షన్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగు లను క్రమబద్ధీకరించి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించా లని, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సావనపెల్లి వెంకటస్వామి, మల్లారపు కొమురయ్య, బొంకూరి సాగర్‌, అడ్లూరి రవి, మామిడిపల్లి శ్రీనివాస్‌, స్వామి, రవి పాల్గొన్నారు.

చలో ఢిల్లీ కార్యక్రమంలో ఆశా, అంగన్‌వాడీ తదితర స్కీమ్‌ వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని సీఐటీ యూ జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని, కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.42 వేలుగా నిర్ణయించాలని, కనీస పెన్షన్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు. వనజ రాణి, సులోచన, శారద, వరలక్ష్మి, సరస్వతి, శ్రీలత, వనిత, మంజుల పాల్గొన్నారు.

ఓదెల, (ఆంధ్రజ్యోతి): చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎర వెల్లి ముత్యంరావు కోరారు. మండల కేంద్రంలో పోస్టర్‌ ను ఆవిష్కరించారు. పైడిపెల్లి నాగయ్య, సంద సదా నందం, తూడి సారయ్య, జగన్‌రావు, బాపు శంకర్‌, జాకీర్‌, రామస్వామి, రాజమహమ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 11:41 PM