కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను బర్తరఫ్ చేయాలి
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:59 PM
ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియను రద్దు చేసి, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, మాస్‌లైన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
పెద్దపల్లి టౌన్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియను రద్దు చేసి, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, మాస్‌లైన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ పేరుతో కోట్లాది ఓట్లను తొలగిం చడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని, 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ కొత్త ఓటర్ల నమోదును చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణ యాలకు స్వస్తి పలకాలని కోరారు. సమస్యను పరిష్కరిం చకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిం చారు. బిక్షపతి, కె.రాజన్న, గుమ్మడి వెంకన్న, గౌతమ్ గోవర్ధన్, కే.కనకరాజ్, స్వామి, లెనిన్, మానస్, కల్లేపల్లి నవీన్, పద్మ, రాధా, నరేష్, రాజేష్ పాల్గొన్నారు.
నేడు ఓట్ బచావో.. దేశ్‌కి బచావో ర్యాలీ
కోల్‌సిటీ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓట్ బచావో... దేశ్‌కి బచావో ర్యాలీని విజయవంతం చేయాలని మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. మంగళవారం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ ముస్తాఫా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఓట్ చోరీకి పాల్పడుతుందని, ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును, ఎన్నికల వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలంటూ బుధవారం గోదావరిఖనిలో ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. చౌరస్తాలోని గాంధీ విగ్రహం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీకి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హాజరవుతారని చెప్పారు. నాయకులు బొంతల రాజేష్, కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికుమార్, దీటి బాలరాజు, మారెల్లి రాజిరెడ్డి, సీపీఐ నాయకులు మార్కపురి సూర్య, శేఖర్, సీపీఎం నాయకులు మహేశ్వరి, ఐఎన్‌టీయూసీ నాయకులు నర్సింహారెడ్డి, ధర్మపురి, సదానందం, దశరథం, కొత్త సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.