Share News

ఓట్ల వేటలో కేంద్రం దొంగదారి!

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:05 AM

ఓట్ల వేటలో కేంద్రం దొంగదారి అవలంబిస్తోందని, చట్టం రూపంలో తీసుకువచ్చిన ఎస్‌ఐఆర్‌ ఒక భూతం లాంటిదని, ఇది ముమ్మాటికీ దొంగదారి చర్యేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ లెవెల్‌ జిల్లా ఏజెంట్ల(బీఎల్‌ఏ)అవగాహన శిక్షణ శిబిరం ఆదివారం ఎన్‌టీపీసీ లోని ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో జరిగింది.

ఓట్ల వేటలో కేంద్రం దొంగదారి!

గోదావరిఖని, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ఓట్ల వేటలో కేంద్రం దొంగదారి అవలంబిస్తోందని, చట్టం రూపంలో తీసుకువచ్చిన ఎస్‌ఐఆర్‌ ఒక భూతం లాంటిదని, ఇది ముమ్మాటికీ దొంగదారి చర్యేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ లెవెల్‌ జిల్లా ఏజెంట్ల(బీఎల్‌ఏ)అవగాహన శిక్షణ శిబిరం ఆదివారం ఎన్‌టీపీసీ లోని ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను టార్గెట్‌ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధ మైన కుట్రలకు తెరలేపిందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభు త్వాలు ఉన్న రాష్ట్రాల్లో అప్రజాస్వామిక పాలన సాగుతోందని మండిప డ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ ఒక పద్ధతి ప్రకారం దాదాపు 30 నుంచి 35 శాతం ఓట్లను’ఫేక్‌ ఓట్లు‘గా చిత్రీకరించి తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఓటరు వయ స్సులో స్వల్ప తేడాలున్నా, పేర్లలో అచ్చుతప్పులు ఉన్నా వాటన్నింటినీ చూపి ఓట్లను తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే బీహార్‌, వెస్ట్‌ బెంగాల్‌ లాంటి రాష్ట్రాల్లో ఈ పద్ధతిని ప్రయోగించి సక్సెస్‌ అయ్యారని, అదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించాలని చూస్తున్నా రన్నారు. దీన్ని కాంగ్రెస్‌ సైనికులు గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

నిన్న ఓట్లు.. నేడు ఏకంగా సీట్లే దొంగిలిస్తున్నారు!

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీనాక్షి నటరాజ న్‌కు కావలసిన ఓట్ల కంటే 11ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, అయినప్పటికీ కేవలం ఒక పాత ఎఫ్‌ఐఆర్‌ను సాకుగా చూపి, ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమంగా ఆమె నామినేషన్ను తిరస్కరింప జేశారన్నారు. ఈ రకంగా కాంగ్రెస్‌ పార్టీకి దక్కాల్సిన ఒక రాజ్యసభ స్థానాన్ని వాళ్ళు దొంగిలించారని పేర్కొన్నారు. నిన్నటి వరకు ఓట్లను దొంగిలించిన వాళ్ళు ఈరోజు ఏకంగా సీట్లనే దొంగిలించే దుస్థితికి కేంద్ర ప్రభుత్వం దిగజారిం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకులు బొగ్గు బాయిల చుట్టూ తిరుగుతు కార్మికులపై కపట ప్రేమ చూపిస్తున్నారని, ఈ ప్రాం తాన్ని అభివృద్ధి చేసిన తరువాతనే అసెంబ్లీ ఎన్నికల్లోకి పోతామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, దేశంలో ఎక్కడ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నా ఇదే రకమైన దుర్మార్గపు పరిపాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదేళ్ళు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుంది

రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో డిపెండెంట్‌ ఉద్యోగం కోసం దాదాపు 15లక్షల రూపాయలు నాయకులకు ఇస్తే ఉద్యోగం వచ్చేదన్నారు. కొత్త బావులు రాకుండా చేసిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీది అని ఆరోపించారు. బూత్‌ లెవెల్‌ అధికారులు నిర్వహించే ’ఓట్‌ మ్యాపింగ్‌‘ ప్రక్రియపై కాంగ్రెస్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశిం చారు. ఉద్యోగాలు, చదువుల రీత్యా హైదరాబాద్‌లో, గ్రామాల్లో ఉండే మన వాళ్ళు అధికారులు వచ్చినప్పుడు ఊర్లో లేరనే సాకుతో ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని, అధికారులు వచ్చే ముందే గ్రామల్లో, డివిజన్‌లో వాడల్లో ఉన్న ఓటర్లను రప్పించి ఓటు కాపాడుకోవాలన్నారు. మనకు దొంగ ఓట్లు అవసరం లేదని, మనకున్న జనాదరణతో ప్రతి ఓటునూ కాపాడుకోవాలని అని స్పష్టం చేశారు. అక్రమ ఎస్‌ఐఆర్‌ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్‌ విజయరమణ రావు, హార్కర వేణుగోపల్‌ రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బీజేపీ ఎస్‌ఐఆర్‌ పేరుతో పెద్ద కుట్రకు తెరలేపిందని, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా తామే గెలుస్తామనే అహంకారంతో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని, అలాంటి కుట్రలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, దానిని కాపాడుకోవడం ప్రతీ పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడే సైనికుడు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తాడో, అదే స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌ శిక్షణ జిల్లా ఇన్‌చార్జి సురేష్‌ షట్కార్‌, రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ ఇరావర్తి అనిల్‌, రాష్ట్ర లైబ్రరీ చెర్మన్‌ రియాజ్‌, ఎస్‌ఐఆర్‌పై జిల్లా బూత్‌ స్థాయి ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. జనక్‌ ప్రసాద్‌, మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, పెద్దపల్లి కాంగ్రెస్‌ జిల్లా కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు ప్రెసిడెంట్‌, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, బూత్‌ల బీఎల్‌ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 12:05 AM