Share News

జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో పూర్తి చేయాలి

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:22 PM

జిల్లాలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో, సమగ్రంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి, సుల్తానాబాద్‌ మండలం దుబ్బపల్లి, చిన్నకలువల గ్రామాలలో జరుగుతున్న జనగణన ప్రక్రియను పరిశీలించారు.

జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో పూర్తి చేయాలి

పెద్దపల్లి రూరల్‌/సుల్తానాబాద్‌ ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో, సమగ్రంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి, సుల్తానాబాద్‌ మండలం దుబ్బపల్లి, చిన్నకలువల గ్రామాలలో జరుగుతున్న జనగణన ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ లకు సంబంధించి ఫిజికల్‌ వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ప్రజల భవిష్యత్‌ ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ లెక్కలపై ఆధారపడుతున్నందున పారదర్శకంగా నమోదు పూర్తి చేయా లన్నారు. గ్రామ స్థాయిలో ల్యాండ్‌మార్క్‌లు, పాఠశాలలు, దేవాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు తదితర గుర్తులను బ్లాక్‌ వారీగా స్పష్టంగా నమోదు చేయాలన్నారు. హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌కు సంబంధించిన వివరాలు ఖచ్చితమైన సమాచారంతో సిద్ధం చేసి సమర్పించాలని అధికా రులను ఆదేశించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌ తహసీల్దార్లు రాజయ్య, బషీరొద్దిన్‌, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:22 PM