సింగరేణిపై అదనపు కార్మికుల భారం
ABN , Publish Date - Mar 27 , 2026 | 11:24 PM
సింగరేణి సంస్థలో అవసరానికి మించి అదనపు కార్మికులు 7వేలకు పైగా ఉన్నారని సంస్థ అంచనాకు వచ్చింది. వీరందరిని తొలగించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నది. గత సంవత్సరంగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం, వారసత్వ ఉద్యోగా లను నిలిపివేయడం, కొత్త నియామకాలు లేకపోవడం వెనక అసలు మతలబు అవసరానికి మించి కార్మికులు ఉండడమనేది తేట తేల్లమవు తున్నది.
గోదావరిఖని, మార్చి 27(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థలో అవసరానికి మించి అదనపు కార్మికులు 7వేలకు పైగా ఉన్నారని సంస్థ అంచనాకు వచ్చింది. వీరందరిని తొలగించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నది. గత సంవత్సరంగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం, వారసత్వ ఉద్యోగా లను నిలిపివేయడం, కొత్త నియామకాలు లేకపోవడం వెనక అసలు మతలబు అవసరానికి మించి కార్మికులు ఉండడమనేది తేట తేల్లమవు తున్నది. ఈ విషయాలు బహిరంగంగా సింగరేణి ప్రకటించే సాహసం చేయడం లేదు. 7000 మంది అదనంగా కార్మికులు ఉండడం సింగరేణికి ఆర్థిక భారంగా తయారైందనేది అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ అంశంపై ప్రభుత్వం తప్ప సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేవు. వేల మంది కార్మికులను తొలగిస్తే కోల్‌బెల్ట్ మొత్తంగా అలజడి చెలరేగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంత మంది అదనపు కార్మికులను భరించడం కూడా సింగరేణికి మోయలేని భారమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభాలు వస్తాయా, నష్టాలు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దీనికి తోడు 50వేల కోట్ల రూపాయల బకాయిలు సింగరేణి నెత్తిన భారంగా మారింది. ఈ పరిస్థి తుల్లో 7వేల మంది కార్మికులను అదనంగా భరించడం సంస్థకు ఇబ్బం దిగా మారింది. 7000మంది కార్మికుల వేతనాలు సరాసరి నెలకు ఒక్కొ క్కరికి ప్రయోజనాలు కలిసి లక్ష రూపాయలు ఉంటుంది. అంటే నెలకు రూ.70 కోట్ల మేర సింగరేణి సంస్థ అదనపు కార్మికులపై ఖర్చు చేస్తోంది. సంవత్సరానికి ఈ భారం వెయ్యి కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం సింగరేణిలో 37వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
దశాబ్దంగా ఒకటి రెండు ఓపెన్ కాస్టులు మినహా సింగరేణిలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కాలేదు. అండర్ గ్రౌండ్ గనులు కొత్తవి రాకపోగా పాత గనులు మూసి వేతకు గురవుతున్నాయి. సింగరేణిలో 20ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు ఉంటే 21మాత్రమే అండర్ గ్రౌండ్ గనులు ఉన్నాయి. ఈ బొగ్గు బావులు కూడా మరో ఐదు సంవత్సరాలలో సగానికి పైగా మూతపడే పరిస్థితి ఉంది. 80వ దశకంలో సింగరేణిలో పరుగు పందెం ద్వారా వేలాది మంది కార్మికులు ఉపాధి పొందారు. వారి పదవీ విరమణతో సింగరేణిలో అద నపు కార్మికుల భారం ఉండదేమోనని యాజమాన్యం భావించింది. కానీ కారుణ్య నియామకాల పేర సింగరేణిలో ఈ దశకంలో సుమారు 20వేల మంది కొత్త కార్మికులు ఉద్యోగాలు పొందారు. దీంతో పదవీ విరమణ అంచనాలు యాజమాన్యం ఊహించిన దానికి భిన్నంగా తయారయ్యాయి. ఇక నుంచి సింగరేణిలో సంవత్సరానికి సగటున వెయ్యి నుంచి 1500 మంది కార్మికులు మాత్రమే పదవీ విరమణ పొందే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఏడు వేలకు పైగా అదనంగా ఉన్న కార్మికులను అనివార్యంగా భరించడం సంస్థకు నష్టదాయకమనే ఆలోచనలో యాజమాన్యం మల్లగు ల్లాలు పడుతున్నది. ఈ అదనపు కార్మికుల్లో రోజు నాలుగు వేల మంది కార్మికులకు పని లేకుండా వేతనాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరా స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రోత్సహించింది. ఇప్పుడు కూడా ఈ అదనపు కార్మికులను సింగరేణికి దూరం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ విషయమై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. సింగరేణిలో అధికారులు కూడా 700 మంది అదనంగా ఉన్నారని, 15 సంవత్సరాల నుంచి కొనసా గుతున్నారని వాదిస్తున్నారు. లక్ష 20వేల మంది కార్మికులు సింగరేణిలో ఉన్నప్పుడు 2700 మంది అధికారులు పనిచేశారని, సాంకేతికత పెరిగినప్పటికీ అధికారుల సంఖ్య తగ్గడం లేదని సంఘాలు వాదిస్తు న్నాయి. ఇప్పటికీ సింగరేణిలో 2200 మంది అధికారులు పనిచేస్తున్నారని, వారిని తొలగించేందుకు యాజమాన్యం ఆలోచన చేయడం లేదని సంఘాలు అంటున్నాయి. సింగరేణి సంస్థకు నూతనంగా వచ్చిన డైరెక్టర్ (పా), సీఎండీ సింగరేణిలో ఇంతకాలం ఉదాసీనంగా జరిగిన కార్యక లాపాలపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. అదనపు కార్మికుల అంశమే కాకుండా సింగరేణిలో ఇంతకాలం జరిగిన రాజకీయ జోక్యం, అవినీతి, ఉదాసీనత, ప్రణాళిక రహిత వ్యవహారాలపై యాజమాన్యం చర్చించినట్లు సమాచారం. అదనపు కార్మికులను ఇంటికి పంపించే ఆలోచన యాజ మాన్యం చేస్తే దాని ప్రభావం ప్రభుత్వం పైనే పడే అవకాశం ఉంది. కోల్‌బెల్ట్ట్ ప్రాంతాల నుండి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్య ర్థులే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కార్మికుల తొలగింపు అంశం తెర మీదకి వస్తే సింగరేణి ప్రాంతంలో ఇదో సామాజిక, రాజకీయ అలజడిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓసీపీలు, అనుమతి పొందిన ప్రాజెక్టులను ప్రారంభించి అదనంగా ఉన్న కార్మికులను విధులు కల్పించాలని పలువురు కోరుతున్నారు. ఈ అంశంపై కార్మిక సంఘాలు కూడా తమ వైఖరులను బహిర్గతం చేసేందుకు సిద్ధమవుతు న్నాయి. ఉత్పత్తి మాసం ముగిసిన తర్వాత అదనపు కార్మికుల విషయంలో సింగరేణి యాజమాన్యం కార్యాచరణ ప్రారంభిస్తుందని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా ఆర్థిక సంక్షోభాన్ని, బొగ్గు ఉత్పత్తి తదితర ప్రతికూలతలను ఎదుర్కొంటున్న సింగరేణి ముందు అదనపు కార్మికుల సమస్య మరింత సంక్లిష్టంగా మారింది.