మార్కెట్ యార్డులో అన్నదాతల అరిగోస
ABN , Publish Date - May 28 , 2026 | 11:47 PM
ఆరుగాలం కష్టపడి పండించిన అన్నదాత లకు అడుగడుగునా అన్యాయమే జరుగు తోందని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకు న్నారు.
పెద్దపల్లి టౌన్, మే 28 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పండించిన అన్నదాత లకు అడుగడుగునా అన్యాయమే జరుగు తోందని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకు న్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ పంటను మార్కెట్‌కు తీసుకొచ్చి నెల రోజులు దాటినా ఇప్పటివరకు కేవలం 50 శాతం మాత్రమే తూకాలు వేశారని, మిగతా సగం మార్కెట్లోనే మూలుగుతోం దని మండిపడ్డారు. అకాల వర్షానికి మక్క లు తడిసిపోయి వాసన వస్తున్నాయని, ధాన్యం కుప్ప కింద తడిసి మొలకెత్తే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు సమయంలో యూరియా, మందు బస్తాలు ఇవ్వకుండా, రైతుబంధు అందిం చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, పంట చేతికొచ్చాక సంచులు, సుతిలి కూడా రైతే కొనుగోలు చేసే పరిస్థితి కల్పించిం దన్నారు. బస్తాలు కూడా రైతులే నింపుకో వాల్సి రావడం అత్యంత దారుణమన్నారు. కాంటాలు ఆలస్యం చేస్తూ రైతులను మాన సిక క్షోభకు గురిచేస్తున్నారని దుయ్యబట్టా రు. మిల్లర్ల తరుగు దోపిడీపై ప్రభుత్వం చర్యలు శూన్యమని, మార్కెట్లో చిరిగిన బస్తాలు ఇచ్చి, ఒక్కో బస్తాలో 35 నుంచి 39 కిలోల ధాన్యం మాత్రమే తూకం వేస్తూ మిల్లర్లు దయాదాక్షిణ్యాలపై రైతులను వది లేశారన్నారు. నిబంధనల ప్రకారం బస్తాకు 40 కిలోల 650 గ్రాములు తూకం వేయాల్సి ఉండగా, కొన్నిచోట్ల 40 కిలోల 600 తూకం వేస్తూ, తరుగు పేరిట క్వింటాలుకు 5 నుంచి 6 కిలోల వరకు రైతుకు నష్టం చేస్తున్నారని ఆరో పించారు. మిల్లర్లు తమ ట్రక్‌షీట్లలో కూడా మార్పు చేస్తూ అక్రమా లకు పాల్పడుతున్నా, ప్రభుత్వం నిమ్మకు నీరె త్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దోపిడీకి పాల్పడుతున్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజకుమార్, మం డల అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, కౌన్సిలర్ వెన్నం రవీందర్ సుజాత, ఉప సర్పంచ్ కుమార్, నాయకులు సలేంద్ర రాములు యాదవ్, తీగల సదయ్య, ముత్యాల రాజ య్య, అంజయ్య,పెంచల శ్రీధర్, కారుపాక సంపత్, సరేష్ బాబు,స్వామి, ధర్మపురి, వైద్య శ్రీనివాస్ పాల్గొన్నారు.