Share News

ప్రకృతి సమతుల్యతను కాపాడాలి

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:35 PM

ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పక్షులు, వన్యప్రాణులు కీలకమని మంథని అటవీ రేంజ్‌ అధికారి ఎం.విన య్‌నాయక్‌ అన్నారు. శనివారం పారుపల్లి గ్రామ పరిధిలో మైదంబండ బీట్‌, బేగంపేట సెక్షన్‌లో ఉన్న పారుపల్లి పెద్ద చెరువు వద్ద బర్డ్‌ వాక్స్‌ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రకృతి సమతుల్యతను కాపాడాలి

ముత్తారం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పక్షులు, వన్యప్రాణులు కీలకమని మంథని అటవీ రేంజ్‌ అధికారి ఎం.విన య్‌నాయక్‌ అన్నారు. శనివారం పారుపల్లి గ్రామ పరిధిలో మైదంబండ బీట్‌, బేగంపేట సెక్షన్‌లో ఉన్న పారుపల్లి పెద్ద చెరువు వద్ద బర్డ్‌ వాక్స్‌ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్స వం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మంథని అటవీ రేంజ్‌ అధికారి ఎం. వినయ్‌ నాయక్‌ మాట్లాడుతూ జీవవైవిధ్య పరిరక్షణ ద్వారా భావితరాలకు ఆరోగ్యకర మైన పర్యావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. అడవులు, చెరువులు, సహజవనరుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. సర్పం చ్‌ చొప్పరి సంపత్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి సంపద పరి రక్షణకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ రేంజ్‌ అధి కారి జె. తిరుపతి, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఎస్‌.కే. నహీదా పర్వీన్‌, ఎస్‌.డి. రహమతుల్లా, ఎం. అమీరుద్దీన్‌, ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు ఎస్‌. మేఘరాజ్‌, టి.రామ్‌సింగ్‌, ఎ.మాధురి, పి.రంజిత, బయాలజిస్ట్‌ చంద్రకాంత్‌, పోతారం, గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 11:35 PM