రెండేళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దాడులు
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:55 PM
రెండేళ్ల పాలనలో ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ నేతలు కేసీఆర్, హరీష్‌రావు, మహిపాల్‌రెడ్డి ఆఫీసులపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆఫీసు పై దాడి చేయటాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
మంథని, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల పాలనలో ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ నేతలు కేసీఆర్, హరీష్‌రావు, మహిపాల్‌రెడ్డి ఆఫీసులపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆఫీసు పై దాడి చేయటాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దాడులు ప్రజాస్వామ్యానికే అవమానకరం అన్నారు. అధికారం కోసం ఇచ్చిన హామీల అమలు చేయకపోవడంతో రేవంత్‌రెడ్డి మాటలను వినే పరిస్థితి లేదన్నారు. మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పనితీరు బాగా లేదన్నారు. రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం దండుపాళ్యం బ్యాచ్‌లా అన్ని వర్గాలను దోచుకుంటున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఏగోళపు శంకర్‌గౌడ్, మాచీడి రాజుగౌడ్, తగరం శంకర్‌లాల్, కనవేన శ్రీనివాస్, గోబ్బూరి వంశీ, వేల్పుల గట్టయ్య, పుప్పాల తిరుపతిలు పాల్గొన్నారు.