ఆర్యవైశ్యులు ఒక్కతాటిపై ఉండాలి
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:37 PM
ఆర్యవైశ్యులంతా ఒకేతాటిపై ఉండాలని మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లి ఆర్యవైశ్య సంఘ భవనంలో పట్టణ అధ్యక్షుడిగా ఒజ్జల సదానందం, ప్రధాన కార్యదర్శిగా వెలిశాల రాజశేఖర్, గౌరవ అధ్యక్షులుగా కేశెట్టి రవీందర్, మండల అధ్యక్షులుగా కాసనగొట్టు విజయ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.
పెద్దపల్లి కల్చరల్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఆర్యవైశ్యులంతా ఒకేతాటిపై ఉండాలని మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లి ఆర్యవైశ్య సంఘ భవనంలో పట్టణ అధ్యక్షుడిగా ఒజ్జల సదానందం, ప్రధాన కార్యదర్శిగా వెలిశాల రాజశేఖర్, గౌరవ అధ్యక్షులుగా కేశెట్టి రవీందర్, మండల అధ్యక్షులుగా కాసనగొట్టు విజయ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కోలేటి దామోదర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలన్నారు. రాజకీయంగా ఉన్నత స్థానాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. ఆర్యవైశ్య కార్పొరే షన్‌కు ప్రభుత్వం వెంటనే 200 కోట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి వంద కోట్లు కేటాయిస్తామని, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి రెండున్నరే ళ్లు దాటినా ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం సిగ్గు చేట న్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఆర్యవైశ్యుల సంక్షేమానికి నిధులు కేటాయించాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేశారని, ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టడంతోపాటు అనేక కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించిందన్నారు. పట్టణ అధ్యక్షుడు ఒజ్జల సదానందం మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి శక్తివం చన లేకుండా పని చేస్తామన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నలుమాచు ప్రభాకర్, గౌరవ అధ్యక్షుడు కోలేటి రమేష్, కన్వీనర్ కోలేటి రాజేందర్, ఎన్నికల అధికారి బాదం రమేష్, చంద్రప్రకాష్ గుప్తా లింగమూర్తి పాల్గొన్నారు.