యూరియా సరఫరాలో తెలంగాణ దేశానికే ఆదర్శం
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:25 AM
యూరియా సర ఫరాలో యాప్ ఆధారిత విధానాన్ని అమలు చేయడం లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వవిప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ కొప్పుల వెంకటరెడ్డితో కలిసి యూరియా బుకింగ్ యాప్‌ను ఆరంభించారు.
పెద్దపల్లి, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): యూరియా సర ఫరాలో యాప్ ఆధారిత విధానాన్ని అమలు చేయడం లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వవిప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ కొప్పుల వెంకటరెడ్డితో కలిసి యూరియా బుకింగ్ యాప్‌ను ఆరంభించారు. ఆయన మాట్లాడు తూ రైతులు యూరియా కొనుగోలులో ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవతో పెద్దపల్లి జిల్లాలో యూరియా బుకింగ్ యాప్‌ను రబీ పంట కాలంలో ప్రవేశ పెట్టిన ట్లు తెలిపారు. యాప్ వినియోగంపై రైతులకు అవ గాహన కల్పించగా పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. గత రబీ సీజన్‌లో జిల్లాలో 4 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరపై కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ను పొందాలంటే రైతులు బీపీటీ, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరామ్, తెలంగాణ సోనా, వరంగల్-44, 1638, 7715 అనే ఏడు సన్నా వరి రకాలనే సాగు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచామని, రైతుల కు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికా రులు, డీలర్లను ఆదేశించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని, ఆయిల్‌పామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. ఈనెల 30 నుంచి రైతుభరోసా ఖరీఫ్ నిధులు విడుదల కానున్నాయని తెలిపారు. జిల్లాలో విద్య, వైద్యం, వ్యవ సాయ రంగాల్లో విశేష పురోగతి సాధించామని, రెండు న్నర సంవత్సరాల్లో విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేసి రాష్ట్రస్థాయి గుర్తింపు పొందినట్లు తెలి పారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్‌లో అధికారులు, డీలర్లు, రైతుల సహకారంతో జిల్లాలో యూరియా సమస్య తలెత్తలేదన్నారు. గత సంవత్సరం జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నుల యూరి యా వినియోగం జరిగిందని, ఈ ఏడాది సూపర్ ఎల్‌ని నో పరిస్థితుల నేపథ్యంలో 26 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుందని తెలిపారు. జిల్లాలో యూరియా కొరతకు అవకాశం లేదని, అంతర్గత సరఫరా వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశిం చారు. ఈ-పాస్ యంత్రాల ద్వారానే యూరియా విక్ర యాలు జరగాలని, మండలాల వారీగా అవసరమైన నిల్వలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించామని, వ్యవసాయ విస్తరణ అధికా రులు రోజూ బుకింగ్‌లను పర్యవేక్షించాలని తెలిపారు. యాప్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తిన వెంటనే 8 నుంచి 10 గంటల్లో పరిష్కరించాలని, జిల్లాలో ఆందో ళనతో అధిక కొనుగోళ్లు జరగకుండా అధికారులు, డీలర్లు రైతులతో సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. గత సీజన్‌లో అక్రమాలకు పాల్పడిన కొన్ని దుకాణాలపై చర్యలు తీసుకున్నామని, ఈసారి ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా కేవలం యాప్, ఈ-పాస్ విధానంలోనే యూరియా సరఫరా చేయాలని ఆదేశించారు.జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, ఎరువుల డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.