Share News

నేరాల నియంత్రణలో సాంకేతికత కీలకం

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:02 AM

నేరాల నియంత్రణలో సాంకేతికత కీలకమని, సీసీ టీఎన్‌ఎస్‌ 2.0 ఈ సాక్ష్యం అమలును వేగ వంతం చేయాలని పోలీస్‌ అధికారులకు రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ఝా సూ చించారు. మంగళవారం కమిషనరేట్‌లో పోలీస్‌ అధికారులతో నేర సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు.

నేరాల నియంత్రణలో సాంకేతికత కీలకం

కోల్‌సిటీ, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణలో సాంకేతికత కీలకమని, సీసీ టీఎన్‌ఎస్‌ 2.0 ఈ సాక్ష్యం అమలును వేగ వంతం చేయాలని పోలీస్‌ అధికారులకు రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ఝా సూ చించారు. మంగళవారం కమిషనరేట్‌లో పోలీస్‌ అధికారులతో నేర సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు. పెండింగ్‌ కేసులు, నిందితుల అరెస్టులు, వారెంట్ల అమలు, దర్యాప్తులో ఉన్న కేసులు, పోలీస్‌ సిబ్బంది పని తీరును సమీక్షించారు. సీపీ మాట్లా డుతూ కమిషనరేట్‌ పరిధిలో నమోదవు తున్న కేసుల దర్యాప్తులో రాజీపడకుండా పారదర్శకతతో పని చేయాలని ఆదేశిం చారు. నమోదయ్యే ప్రతీ కేసులు గడువు లోగా పూర్తిచేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అవ సరమైతే న్యాయ సలహా తీసుకుని దర్యా ప్తును వేగవంతం చేయాలని, ఆస్తి సంబం ధిత నేరాలు, ఆర్థిక నేరాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించి అటాచ్‌మెంట్‌ ప్రక్రియలకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. మహిళ లకు సంబంధించిన కేసుల్లో నిందితుల అరె స్టులను ఆలస్యం చేయరాదని, గ్రేవ్‌ కేసులు, ఎన్‌డీపీఎస్‌ కేసులు డీసీపీలు, ఏసీపీలు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పెండింగ్‌, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ల అమ లుపై రోజు పర్యవేక్షించాలని, చిన్న నేరాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఫిర్యాదులు, సీసీసీ పిటీషన్ల విచారణలో క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిర్ధారించి దర్యాప్తు ప్రక్రియ వేగవంతం చేసి కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతి ఎస్‌హెచ్‌ఓ, సీఐ స్థానిక ఇంటలీజెన్స్‌ వ్యవస్థను బలో పేతంచేసి ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలతో సత్సంబం ధాలు కొనసాగించాలని సూచించారు. వాహనాల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌, డ్రాగన్‌లైట్లు, కోన్స్‌, క్రైమ్‌ ప్రొటెక్షన్‌, రిబ్బన్‌ రైట్‌ గేర్‌ కిట్‌ తప్పనిసరిగా ఉండాలని, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో, వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ముందస్తు అప్రమ త్తతతో వ్యవహరించాలని కోరారు. సీసీటీ ఎన్‌ఎస్‌లో డేటా అప్‌లోడింగ్‌ పెండింగ్‌ లేకుండా పని చేసే సిబ్బందికి రివార్డులను అందజేస్తామన్నారు. డీసీపీ రాంరెడ్డి, మంచి ర్యాల డీసీపీ భాస్కర్‌, అదనపు డీసీపీ (అడ్మిన్‌) శ్రీనివాస్‌, గోదావరిఖని ఏసీపీ రమేష్‌, పెద్దపల్లి రమేష్‌ గజ్జి కృష్ణ, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌ కుమార్‌, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌, పెద్దపల్లి ఏసీపీ నాగేందర్‌ ఇన్‌స్పెక్టర్లు, సీఐలు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 12:02 AM