ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:05 AM
విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ యాకన్నకు వినతిపత్రం అందించారు.
ఎలిగేడు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ యాకన్నకు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ పాఠశాల సమయాల్లో నిరంతర శిక్షణలు, బోధనేతర పనులు, ఆన్‌లైన్ పనులతో టీచర్లను బోధన నుంచి దూరం చేస్తున్నారన్నారు. యేటా వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయడం, ప్రైవేటు బడుల శంకుస్థాపనను నిరాటంకంగా జరుగుతున్నాయన్నారు. పీఆర్‌సీ నివేదికను వెంటనే తెప్పించుకొని 2023 నుంచి అమలు చేయాలన్నారు. పెండింగ్‌లోని డీఏలు చెల్లించాలని, సర్వీస్ ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్దరించాలన్నారు. నాయకులు కుమారస్వామి, అప్పిడి సంతోష్ రెడ్డి, పులి వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేష్, కుమార్, గండ్ర దేవెందర్‌రావు, వెంకటేశ్వర్లు, సంపత్, రాము, స్రవంతి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేసి జీవో నెంబర్ 25 సవరించాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పలు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీల ఆధ్వర్యంలో తహసీల్దార్ వనజకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యోగులకు, ఉపాధ్యా యులకు పీఆర్సీ అమలు చేయాలని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారని, రాష్ట్రంలో పాత పెన్షన్ స్కీం అమలు చేయాలని కోరారు. హెల్త్ స్కీం విధి, విధా నాలు రూపొందించి, హెల్త్ కార్డు విడుదల చేయాలని, సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బకా యిలు చెల్లించే వరకు నెలకు రెండువేల కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈనెల 19న జిల్లా స్థాయిలో, 29న రాష్ట్ర స్థాయిలో ధర్నా చేపడతామని తెలిపారు. అశోక్ రెడ్డి,అమృత కిషోర్, తంగళ్లపల్లి సురేష్,వెంకటరమణ, రామకృష్ణ,రాము,జిల్లపెల్లి రమేష్, నల్లగొండయ్య, పాల్గొన్నారు.
అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమ స్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వ ర్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. పీఆర్‌సీ ప్రకటించాలని, డీఏలను చెల్లించాలని కోరారు. సుదర్శన్‌రెడ్డి, కిరణ్‌కుమార్, ఉమా మహేశ్వర్, రమేష్, వసుంధర, ప్రమీల, చంద్రశేఖర్, స్నేహలత, లావణ్య, లక్ష్మణ్‌కుమార్, ప్రశాంత్ పాల్గొన్నారు.