ఉపాధ్యాయులు ఫుల్.. విద్యార్థులు నిల్...
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:24 PM
అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులుయ ఉన్నారు. సోమవారం నుంచి బడి తలుపులు తెరుచుకున్నాయి. అయితే అమావాస్య కావడంతో ఆ పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులు మినహా విద్యార్థులెవ్వరూ హాజరు కాలేదు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులుయ ఉన్నారు. సోమవారం నుంచి బడి తలుపులు తెరుచుకున్నాయి. అయితే అమావాస్య కావడంతో ఆ పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులు మినహా విద్యార్థులెవ్వరూ హాజరు కాలేదు. సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 84 మంది విద్యార్థులకు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. 12 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఇలా చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు హాజరుకాలేదు. అమావాస్య అంటే చీకటి కాబట్టి ఆ రోజు బడికి వెళితే ఏడాది అంతా చదువులో వెనుకబడి ఉంటారనే అభిప్రాయంతో చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించ లేదు. యేటా జూన్ 12వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ఆరంభమై ఏప్రిల్ 23వ తేదీతో ముగుస్తుంది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో 12న ప్రారంభం కావా ల్సిన పాఠశాలలను 15వ తేదీకి వాయిదా వేసింది. జిల్లాలో 528 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో 30,448 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. సోమవారం జిల్లాలో గల ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. సోమవారం అమావాస్య ఎఫెక్ట్‌తో 15 శాతం మంది విద్యార్థులు కూడా పాఠశాలలకు హాజరు కాలేదు. కొన్ని పాఠశాలలకు అయితే ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదు. ప్రభుత్వ పాఠశాలలకే గాకుండా ప్రైవేట్ పాఠశాలలకు కూడా అంతే మొత్తంలో విద్యార్థులు హాజరు కాలేదు. అయితే ఈ నెల 16వ తేదీ మంగళవారం కావడంతో ఆ రోజు కూడా విద్యార్థులు పాఠశాలలకు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవచ్చని తెలుస్తున్నది. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బడిబాటలో భాగంగా పాఠశాలల ఆరంభం రోజున ‘వెల్‌కం డే’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సంసి ద్ధంగా ఉన్నప్పటికీ, అమావాస్య కారణంగా విద్యార్థులు హాజరు కాలేదు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం రోజున మండలంలోని అన్ని గ్రామాలలో విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. ప్రతీ పాఠశాలలలో ఒక్కరు లేదా ఇద్దరు ముగ్గురు పిల్లలు మాత్రమే హాజరు కాగా ఉపాధ్యాయులు అందరూ హాజరయ్యారు. సోమవారం అమావాస్య కావడంతో మంచి రోజు కాదనే భావన అందరిలో ఉంది. సుల్తానాబాద్ ప్రభుత్వ పాఠశాలలో 84 మంది విద్యార్థులు ఉండగా నలుగురు మాత్రమే వచ్చారు. హైస్కూల్‌లో 6వ తరగతిలో ఒకరు, 7వ తరగతిలో ఒకరు, పదో తరగతిలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.
అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకుగాను ఒక్కరు కూడా రాలేదు. ఆకన పల్లి ప్రైమరీ పాఠశాలలో ముగ్గురు వచ్చారు. దీంతో మండలంలోని ప్రతి పాఠశాలలో అమావాస్య ప్రభావం కనిపించిందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం నుంచి విద్యార్థులు వస్తారని ఎంఈఓ సంగీత తెలిపారు.
కోల్‌సిటీటౌన్, (ఆంధ్రజ్యోతి): రామగుండం, ఎన్‌టీపీసీ, గోదావరిఖని ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తగినంత మంది విద్యార్థులు హాజరుకాలేదు. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లలో ఒక్కొచోట 5గురు నుంచి 20 మంది విద్యార్థులు హాజరయ్యారు. విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 10 మంది, గాంఽధీపార్కు ప్రాథమికోన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులు, జెడ్పీ బాలికల పాఠశాలలో 25 మంది విద్యార్థులు హాజరయ్యారు.