ఒప్పందాలపై టీబీజీకేఎస్ తప్పుడు ప్రచారం
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:02 AM
గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ యాజమాన్యంతో చేసుకున్న 24 అగ్రిమెంట్లపై టీబీజీకేఎస్ విషప్రచారం చేస్తోందని, ఒప్పం దాలపై బహిరంగ చర్చకు టీబీజీకేఎస్ రావాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య సవాల్ చేశారు. శుక్రవారం కాలనీలో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు.
యైుటింక్లయిన్‌కాలనీ, అక్టోబరు 2 (ఆంధ్ర జ్యోతి): గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ యాజమాన్యంతో చేసుకున్న 24 అగ్రిమెంట్లపై టీబీజీకేఎస్ విషప్రచారం చేస్తోందని, ఒప్పం దాలపై బహిరంగ చర్చకు టీబీజీకేఎస్ రావాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య సవాల్ చేశారు. శుక్రవారం కాలనీలో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. జీబీసీసీఐలో పెర్క్స్ మీద ఐటీ రీయింబర్స్ జరిగినప్పుడు టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉందన్నారు. సింగరేణి ప్రస్తుత దుస్థితికి బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్‌లు కారణమని విమర్శిం చారు. వారి హయాంలో ఒక్క కొత్త గని ప్రారంభించలేదని, తాము గెలి చాక రెండు గనులు దక్కాయని, మరో నెల రోజుల్లో రెండు గనులు దక్కించుకునేలా యాజమాన్యానికి సూచనలు చేసినట్టు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సింగరేణి నిధులను ఏ ప్రభు త్వం తీసుకోలేదని, బీఆర్‌ఎస్ అధికారం లోకి వచ్చాకే విద్యుత్ సంస్థల నుండి26 వేల కోట్లు బకాయిలు పడినట్టు తెలిపారు. గనుల వేలంలో పాల్గొనకుండా సింగరేణిని కట్టడి చేసి రెండు గనులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారని, అవి బొగ్గు తీయలేక పోయినట్టు తెలిపారు. 24 అగ్రి మెంట్లు సర్క్యులర్ల రూపంలో నెల రోజుల్లో రానున్నాయని, అవి అమలులోకి వస్తే క్రెడిట్ ఏఐటీయూసీకి వస్తుందనే ఎన్నిక లకు వెళ్ళా లని టీబీజీకేఎస్ కుట్ర చేస్తున్నట్టు ఆరోపిం చారు. 2017లో గుర్తింపు సంఘం ఎన్ని కల్లో గెలిచిన టీబీజీకేఎస్‌కు రెండేళ్ళ కాలానికి పత్రం తీసుకుని ఆరేళ్ళకుపైగా హోదాలో ఉన్న దని, ప్రస్తుతం రెండేళ్ళ కాలపరిమితి ఉండాలని రెం డు నాల్కల ధోరణిని అవలంభిస్తున్నట్టు ఆయన విమర్శించారు. 11 ఏళ్ళు గుర్తింపు సంఘంగా లేకున్నా ఏఐటీయూసీ కార్మిక పక్షపాతిగా పోరా డిందని, బీఆర్‌ఎస్ అధికారంలో ఉంటేనే మను గడలో ఉండే టీబీజీకేఎస్ ఎలా కార్మిక సంఘం గా పని చేస్తుందో కార్మికులు ఆలోచించాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, మడ్డి ఎల్లయ్య, సమ్మయ్య, వీరభద్రం, రాజారత్నం, వీరస్వామి, వెంకట్, స్వామి, రాజ్‌గోపాల్, అక్బర్‌అలీ, అన్నారావు పాల్గొన్నారు.