Share News

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:32 AM

వానాకాలం సీజన్‌ను దృష్టి లో ఉంచుకొని రైతులు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కల గకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ శాఖ అధికారులు, జిల్లా సహకార అధికారి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యద ర్శులతో వానాకాలం సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి

పెద్దపల్లి టౌన్‌, జూన్‌ 22 (ఆంఽధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌ను దృష్టి లో ఉంచుకొని రైతులు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కల గకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ శాఖ అధికారులు, జిల్లా సహకార అధికారి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యద ర్శులతో వానాకాలం సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వానాకాలంలో ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున విద్యుత్‌ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు, వినియోగదారులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు కలగ కుండా చూడాలని సూచించారు. నియోజకవర్గంలో అవసరమైన విద్యుత్‌ సబ్‌స్టేషన్లను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పెద్దపల్లి బైపాస్‌ రహదారి నిర్మాణంలో అడ్డుగా ఉన్న విద్యుత్‌ స్తంభా లను తొలగించి సురక్షితమైన ప్రదేశాలకు మార్చాలని సూచించారు. ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధి కారులకు తెలిపారు. అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు ముందస్తు ప్రణాళికతో పనిచేసి రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా ఉంచి రైతులు మోస పోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విత్తనాల విక్రయాలు నిబంధనలకు అనుగుణంగా జరిగేలా చూడడంతో పాటు డిజిటల్‌ ఎంట్రీలు, స్టాక్‌ వివరాలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా సహకార అధికారి శ్రీమాలకు ఆదేశించారు. విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ గంగాధర్‌, డీఈ రాజబ్రహ్మచారి, ఏఈలు, ఏడీఈలు, ప్యాక్స్‌ కార్యదర్శులు పాల్గొన్నారు

Updated Date - Jun 23 , 2026 | 12:32 AM