Share News

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:20 AM

విద్యార్థులు పరీక్షలపై భయాన్ని వీడి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఏసీపీ మడత రమేష్‌ అన్నారు. గురువారం రామగుండం గురుకుల కళాశాలలోని పదో తరగతి విద్యార్థులకు ఆర్యవైశ్య సంఘం సలహాదారులు సురేష్‌ సహకారంతో పరీక్ష ప్యాడ్‌లు, పెన్నుల పంపిణీ కార్యక్ర మం నిర్వహించారు.

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి

కోల్‌సిటీటౌన్‌, మార్చి12(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు పరీక్షలపై భయాన్ని వీడి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఏసీపీ మడత రమేష్‌ అన్నారు. గురువారం రామగుండం గురుకుల కళాశాలలోని పదో తరగతి విద్యార్థులకు ఆర్యవైశ్య సంఘం సలహాదారులు సురేష్‌ సహకారంతో పరీక్ష ప్యాడ్‌లు, పెన్నుల పంపిణీ కార్యక్ర మం నిర్వహించారు. ఏసీపీ, రాముగండం ఎస్‌ఐ సంధ్య చేతుల మీదుగా అందజేశారు. పదో తరగతి విద్యార్థి జీవితంలో తొలిమెట్టని, ప్రత్యేక శ్రద్ధతో చదివి పరీక్షలు రాయాలన్నారు. చదువతోనే సమాజంలో గౌరవం ఉంటుందన్నారు. రామగుండం గురుకుల పేరంట్స్‌ కమిటీ, ఎస్‌సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్‌ సభ్యు లు కవ్వంపెల్లి సతీష్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల ఎస్‌వీపీ రజిత, జేవీపీ రజిత, పేరంట్స్‌ కమి టీ చైర్మన్‌ ఉషారాణిమురళీ, భాగ్యలక్ష్మి, మాధవి, అం జలి, సంధ్యారాణి, రజిత, నవీన, శైలజ, కళ్యాణి, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి

జ్యోతినగర్‌, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠ శాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. గురువారం ఎన్టీపీసీలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో మాట్లా డారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిం చాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత చదువులు చదివి, పోటీ పరీక్షల ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. అయినా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల ను చదివించేందుకు తల్లితండ్రులు తాపత్రయ పడు తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన, నాణ్యమైన చదువు ఉంటుందన్నారు. కార్పొరే టర్లు కోలని కవితారెడ్డి, వెంగళబాపు, ప్రధానోపాధ్యా యులు జయరాజ్‌, ఉపాధ్యాయులు, కాంట్రాక్టర్‌ మహేందర్‌ గౌడ్‌, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ జడ్పీ పాఠశాల నుంచి వంద మంది విద్యార్థులకు ఎస్‌ఆర్‌ఎం కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ అధినేత మాచిడి మహేందర్‌ గౌడ్‌ పరీక్ష ప్యాడ్లు, ఇతర స్టేషనరీలను అందించారు. పదిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థుల కు రూ.10 వేలు బహుమతిగా అందిస్తానని ప్రకటిం చారు. ప్రధానోపాధ్యాయుడు జయరాజ్‌, ఉపాధ్యా యులు రమేష్‌, అనురాధ, శ్రీధర్‌రావు, అంజలి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:20 AM