కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:40 PM
రైతులు పండించిన ధాన్యానికి తమ ప్రభుత్వం మద్దతు ధరను చెల్లిస్తోందని, తూకం వేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులను జమచేస్తామని ప్రభుత్వవిప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండల కేం ద్రంతో పాటు కుమ్మరికుంటా, కోనరావుపేట గ్రామాల్లో గురువారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
జూలపల్లి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన ధాన్యానికి తమ ప్రభుత్వం మద్దతు ధరను చెల్లిస్తోందని, తూకం వేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులను జమచేస్తామని ప్రభుత్వవిప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండల కేం ద్రంతో పాటు కుమ్మరికుంటా, కోనరావుపేట గ్రామాల్లో గురువారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు దళారులకు అమ్మ కుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ము కుని ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సూచించారు. సన్న వడ్లకు ప్రభుత్వ మద్దతు దరతో పాటు 500 బోనస్‌గా అందిస్తుందని గుర్తుచేశారు. యాసంగిలో రైతులు ఆరు తడి పంటల సాగుపై మొగ్గు చూ పాలని రైతులకు సూచిం చారు. తహసీల్దార్ దత్తు ప్రసాద్‌రావు, ఏఓ ప్రత్యూష, సింగిల్‌విండో చైర్మెన్ లోక జలపతిరెడ్డి, సర్పంచులు పాటకుల అనూష, సూర ప్రభుదాస్, నల్ల నరెందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌లు మహేష్, హరికిషన్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పాటకుల అనిల్, నాయకులు లింగయ్యగౌడ్, రవి, లచ్చయ్య పాల్గొన్నారు.