పంచాయతీల అభివృద్ధికి బాసట
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:07 AM
గ్రామ పంచాయతీలు ట్రెజరీల ద్వారా కాకుండా తమ ఆదాయాలను ఇక నేరుగా సొంత బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నంబరు 43 విడుదల చేసింది. జీపీలకు సంబంధించిన చెక్కులపై ఉప సర్పంచలు ఏడు రోజుల్లోపే సంతకాలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈరెండు నిర్ణయాలు సర్పంచలకు, గ్రామీణాభివృద్ధికి అనుకూలంగా కావడంతో హర్షం వ్యక్తమవుతోంది.
జగిత్యాల, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలు ట్రెజరీల ద్వారా కాకుండా తమ ఆదాయాలను ఇక నేరుగా సొంత బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నంబరు 43 విడుదల చేసింది. జీపీలకు సంబంధించిన చెక్కులపై ఉప సర్పంచలు ఏడు రోజుల్లోపే సంతకాలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈరెండు నిర్ణయాలు సర్పంచలకు, గ్రామీణాభివృద్ధికి అనుకూలంగా కావడంతో హర్షం వ్యక్తమవుతోంది.
ఫజిల్లాలో 385 పంచాయతీలు..
జిల్లాలో 385 పంచాయతీలున్నాయి. ఇప్పటి వరకు వీటికి వచ్చే సొంత, ప్రభుత్వ నిధులు బ్యాంకుల్లో జమ అయ్యేవి. తిరిగి వాటిని ఖర్చు చేయాలంటే పనులు పూర్తి చేసిన తర్వాత సర్పంచ, ఉప సర్పంచలు జాయింట్ సంతకం చేసిన చెక్కులను ట్రెజరీలు ఐఎఫ్‌ఎంఎస్ ద్వారా పొందాల్సి వచ్చేది. తరచుగా నిధులు ఫ్రీజింగ్‌లో ఉండటంతో సకాలంలో నిధులు రాక, ఒక్కోసారి పంచాయతీ సిబ్బందికి జీతాలు, విద్యుత బల్బులు, పారిశుద్ధ్యం, తాగు నీటి సమస్యలు ఎదురయ్యేవి. ఈ క్రమంలో పంచాయతీకి వచ్చే సొంత ఆదాయం ఇక నుంచి ఖాతాల్లో జమ చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఫలితంగా వెంటనే నిధులు తీసుకునే అవకాశం లభిస్తుంది.
ఫజీపీలకు వచ్చే సొంత నిధులు..
గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సొంత వనరులు కూడా సమకూరుతాయి. ఇందులో ఓన సోర్స్ రెవెన్యూ (ఓఎస్‌ఆర్) కింద ఇంటి, ఖాళీ స్థలాలు, కులాయి పన్ను, ట్రేడ్ లైసెన్స, భవన నిర్మాణ అనుమతులు, మార్కెట్ ఫీజులు, దుకాణాల అద్దెలు, చెరువుల ఆస్తులు, ప్రకటనల ఫీజులు, చేపల చెరువుల ద్వారా వచ్చే ఆదాయం, పంచాయతీ భూముల లీజులు, మార్కెట్ కమిటీల నుంచి రావాల్సిన వాటా, పంచాయతీకి వచ్చే విరాళాలు తదితర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇక నుంచి పోస్టాఫీసులు, బ్యాంకుల్లో జమ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వాటిని సర్పంచ, ఉప సర్పంచల జాయింట్ చెక్కుతో డ్రా చేసుకునే వీలుంది.
ఫఉప సర్పంచల పంచాయతీకి చెక్..
కొన్ని గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాల వల్ల ఉప సర్పంచలు చెక్కులపై సంతకాలు పెట్టడానికి నిరాకరించేవారు. దీంతో సర్పంచలు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక నుంచి ఉప సర్పంచలు వారం రోజుల్లో తప్పకుండా సంతకాలు చేయాలి. లేకుంటే ఉప సర్పంచలకు ఉమ్మడి చెక్ పవర్ రద్దు చేసి, దానిని పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారుల్లో ఒకరికి అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
- పల్లె లక్ష్మి, వెల్దుర్తి సర్పంచ, జగిత్యాల రూరల్ మండలం
గ్రామ పంచాయతీల ఓఎస్‌ఆర్ నిధులకు సొంత ఖాతాలు ఏర్పాటు చేసుకొని డ్రా చేసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. ట్రెజరీల ద్వారా వచ్చే బిల్లులు ఫ్రీజింగ్ కారణంగా ఆలస్యం అయ్యేవి. దీంతో పనుల్లో ఇబ్బందులు ఏర్పడేవి. ప్రస్తుతం ఆ సమస్య తీరనుంది. ఉప సర్పంచ సంతకానికి ఏడు రోజలు వ్యవధి నిర్ణయించడం కూడా మంచిదే.
ప్రభుత్వ ఆదేశాల మేరకే...
-మదనమోహన, జిల్లా పంచాయతీ అధికారి
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని గ్రామ పంచాయతీలకు నూతన ఖాతాలు తెరిపించనున్నాము. గ్రామాల్లో చేపట్టే పనుల కోసం జీపీ తీర్మాణాలు చేసి పనులు పూర్తయిన అనంతరం ఎంబీ రికార్డు చేసి బిల్లులు సమర్పించి ఈ ఖాతాల నుంచి నేరుగా నిధులు డ్రా చేసుకోవచ్చు. నూతన విధానంతో సులువుగా, వేగంగా నిధులు డ్రా చేసుకోవడంతో పాటు సమస్యలను త్వరగా పరిష్కరించుకునే అవకాశం లభిస్తుంది.