Share News

కాంగ్రెస్‌ హయాంలో సుల్తానాబాద్‌కు మహర్దశ

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:47 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సుల్తానాబాద్‌ పట్టణానికి మహర్దశ చేకూరిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు వార్డులకు సంబంధించిన ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ళ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం పాత జెండా చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్‌ హయాంలో సుల్తానాబాద్‌కు మహర్దశ

సుల్తానాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సుల్తానాబాద్‌ పట్టణానికి మహర్దశ చేకూరిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు వార్డులకు సంబంధించిన ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ళ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం పాత జెండా చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు. పలువురు లబ్ధిదారుల ఇండ్లకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి ముగ్గులు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతు పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సవతి తల్లి ప్రేమకు గురైన సుల్తానాబాద్‌ అభివృద్ధిలో వెనకబడిందన్నారు. పట్టణ అభివృద్ధికి తాను సీఎం, మంత్రుల సహకారంతో కోట్లాది రూపాయల నిధులను తెస్తున్నానని, ప్రధాన రోడ్లను డబుల్‌ రోడ్లుగా మారుస్తున్నామని చెప్పారు. మున్సిపల్‌ కమీషనర్‌ టి రమేష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌ రావు, గాజుల రాజమల్లు, పన్నాల రాములు, బిరుదు సమత క్రిష్ణ, నిషాత్‌ రఫిక్‌, ఊట్ల వరప్రసాద్‌, అబ్బయ్య గౌడ్‌, సంతోష్‌ రావు, శ్రీగిరి శ్రీనివాస్‌, దామోదర్‌ రావు, సాయిరి మహేందర్‌, రాజలింగం. తిరుపతి, టికే ప్రభాకర్‌, ముత్యాలు, దొడ్ల సందీప్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 11:47 PM