సుల్తానాబాద్ చెరువుకు మహర్దశ
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:57 PM
సుల్తానాబాద్ పట్టణంలో ని చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో నంబరు 170 ద్వారా ఉత్త ర్వులు జారీ చేసింది. మినీ ట్యాంక్ బండ్ పనుల కోసం ప్రభుత్వం రూ.8.77 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సుల్తానాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ పట్టణంలో ని చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో నంబరు 170 ద్వారా ఉత్త ర్వులు జారీ చేసింది. మినీ ట్యాంక్ బండ్ పనుల కోసం ప్రభుత్వం రూ.8.77 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు చెరువు అభి వృద్ధికి నిధులు మంజూరుకు కృషి చేశారు. చెరువును మినీట్యాంకు బండ్‌గా చేయడం వల్ల చెరువు చుట్టూ పార్కు ఏర్పాటు చేయడంతో ప్రజలు సేదతీరే అవకాశం ఉంది. తాను ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు మినీట్యాంక్ బండ్ పనులకు నిధులు తెచ్చానని ప్రభుత్వ విప్ విజయరమణారావు పేర్కొన్నారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిం చానన్నారు. మినీ ట్యాంక్ బండ్ కోసం నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఽశ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు క్షీరాభిషేకం
చెరువు అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.8.77 కోట్లు మం జూరు చేసినందుకు కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మార్చడానికి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు పట్టుదలతో నిధులు మంజూరు చేయించార న్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, విప్ విజయరమణారావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ, వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్షలత, కౌన్సిలర్లు గాజుల రాజమల్లు, ఊట్ల వరప్రదీప్, చింతల రాజు, నాయకులు పాల్గొన్నారు.