Share News

కష్టపడి చదివి పోలీస్‌ ఉద్యోగాలు సాధించాలి

ABN , Publish Date - Nov 15 , 2026 | 10:51 PM

గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు పోలీస్‌ ఉద్యోగాల సాధనలో మెరుగైన అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు అన్నారు.

కష్టపడి చదివి పోలీస్‌ ఉద్యోగాలు సాధించాలి

మంథని, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు పోలీస్‌ ఉద్యోగాల సాధనలో మెరుగైన అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు అన్నారు. మంత్రి శ్రీధర్‌ బాబు ఆధ్వర్యంలో శ్రీవిశ్వ అకాడమీ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత మన ఊరు-మన కోచింగ్‌ సెంటర్‌ కార్యక్రమంలో భాగంగా స్థానిక శివకిరణ్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదివారం స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించడంతో పాటు, రోజూ మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని కల్పించారన్నారు. అభ్యర్థులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉచిత కోచింగ్‌, భోజన సదుపాయాలు కల్పించి పోలీస్‌ ఉద్యోగాల సాధనకు మంత్రి శ్రీధర్‌బాబు అండగా నిలుస్తున్నారన్నారు. దాదాపు 120 రోజులు పూర్తి కావస్తున్నందున శిక్షణ కార్యక్రమాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవా లన్నారు. క్రమశిక్షణతో కష్టపడి చదివి పోలీస్‌ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మంత్రి శ్రీధర్‌బాబు పని చేస్తున్నారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిరుద్యోగ యువతకు ఉపయోగకరం గా నిలుస్తాయన్నారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ మం చి ఫలితాలు సాధించి కు టుంబాలకు, ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని కోరారు. మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ సయేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్నన్‌ కొత్త శ్రీనివాస్‌, నేతలు సెగ్గెం రాజేష్‌, రమసురేష్‌రెడ్డి, చొప్పరి సదానందం, కిషన్‌జీ, కొండ శంకర్‌, ప్రవీణ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 10:51 PM