డ్రగ్స్, సోషల్‌మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:47 PM
విద్యార్థులు డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, సోషల్ మీడియా వ్యసనాలకు దూ రంగా ఉండాలని డీసీపీ రాంరెడ్డి నాయక్ పిలుపు నిచ్చారు. గురువారం అశోక్‌నగర్‌లోని ఒక ఫంక్షన్ హాల్ లో మత్తురహిత సమాజం అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కోల్‌సిటీ, జూన్ 25(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, సోషల్ మీడియా వ్యసనాలకు దూ రంగా ఉండాలని డీసీపీ రాంరెడ్డి నాయక్ పిలుపు నిచ్చారు. గురువారం అశోక్‌నగర్‌లోని ఒక ఫంక్షన్ హాల్ లో మత్తురహిత సమాజం అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు మాద క ద్రవ్యాలు, సోషల్ మీడియా వ్యసనాలకు, ఇతర అనా రోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిం చారు. వ్యసనాలకు లోనైతే భవిష్యత్ దెబ్బతినే ప్రమా దం ఉందన్నారు. విద్యార్థులు విద్యపై దృష్టి సారిం చాలని, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయా లన్నారు. ఇంటర్మీడియట్ అనంతరం యువతకు అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉంటా యని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. సోషల్ మీడియా రీల్స్, అనవసర చాటింగ్‌పై సమయాన్ని వృథా చేయకుండా విద్య, నైపుణ్యాన్ని పెం పొందించుకోవాలన్నారు. ఏసీపీ రమేష్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు మనోహర్, అనూష, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
కోల్‌సిటీటౌన్, (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని సెక్రెడ్ హార్ట్ హైస్కూల్ విద్యార్థులకు మాదకద్రవ్యాల నివా రణపై అవగాహన కల్పించారు. ఎన్‌సీసీ ఫస్ట్ ఆఫీసర్ జ్యోత్న్స మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్ దెబ్బతింటుందని, వాటి వినియోగం వల్ల ఆరోగ్యంతోపాటు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపు తుందన్నారు. ప్రధానోపాధ్యాయురాలు ఆరోగ్యమేరి మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఎన్‌సీసీ కెడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): రామగుండం పట్టణంలోని విశ్వభారతి, సెయింట్‌జోసెఫ్ విద్యాసంస్థలో మాదకద్ర వ్యాల వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ రమేష్, సీఐ కృష్ణకుమార్, ఎస్‌ఐ సంధ్యారాణి, విశ్వభారతి విద్యాసంస్థల చైర్మన్ బందా రపు యాదగిరి గౌడ్, హెడ్మామాస్టర్ తిరుపతి, నోయల్ జోసెఫ్, ఆశాలత, విద్యార్థులకు, నవోదయ విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి వివ రించారు. యువత బానిసలుగా మారి భవిష్యత్‌ను నాశ నం చేసుకుంటున్నారని, తల్లితండ్రులకు ఆవేదన కలి గిస్తున్నారని వివరించారు. విద్యార్థులు డ్రగ్స్ వినియో గానికి, అనవసరమైన మొబైల్ వాడకానికి దూరంగా ఉండాలని పోలీస్ అధికారులు, చైర్మన్, అధ్యాపక బృందం విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.