విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
ABN , Publish Date - May 13 , 2026 | 12:00 AM
విద్యా ర్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థు లను మంగళవారం రాత్రి క్యాంపు కార్యాల యంలో సన్మానించారు.
కళ్యాణ్‌నగర్, మే 12(ఆంధ్రజ్యోతి): విద్యా ర్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థు లను మంగళవారం రాత్రి క్యాంపు కార్యాల యంలో సన్మానించారు. ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, సరైన అవ కాశాలు, ప్రోత్సాహాలు లభిస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిద్రండులకు, ఉపాధ్యాయులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతి భను వెలికి తీయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు.
టీవీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
గోదావరిఖని, (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని బాలుర జూనియర్ కళాశాలలో మంగళవా రం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎమ్మెల్యే మక్కాన్‌రాజ్‌ఠాకూర్ డిజిటల్ టీవీల ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ టీవీలను ఉపయోగించుకొని శ్రద్ధగా చదివి కళాశాలకు పేరు తీసుకురావాలన్నారు. టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను అభినం దించారు. మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ పద్మావతి రంజిత్, కళాశాల ప్రిన్సిపల్ సంజీ వయ్య, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.