ఏఐపై విద్యార్థులు పట్టు సాధించాలి
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:10 AM
దేశంలో సాంకేతిక అభివృద్ధి దిశగా పయ నిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణం గా విద్యార్థులు సాంకేతికత పై పట్టు సాధించాలని ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం రాత్రి జేఎన్టీయూ కళాశాల 14వ వార్షికోత్స వాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రాం గణంలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రామగిరి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): దేశంలో సాంకేతిక అభివృద్ధి దిశగా పయ నిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణం గా విద్యార్థులు సాంకేతికత పై పట్టు సాధించాలని ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం రాత్రి జేఎన్టీయూ కళాశాల 14వ వార్షికోత్స వాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రాం గణంలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాశాల లోని బ్లాక్-2లో మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కళా శాలలో చేపట్టిన ఆడిటోరియంను మంత్రి ప్రారంబించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సాంకే తిక పట్టు సాధిస్తూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల సీఎస్‌ఈ విభా గం ఆధ్వర్యంలో జనరేటివ్ ఏఐ అండ్ డేటా సైన్సెస్ మూడు రోజుల వర్క్‌షాప్ నిర్వహించి విద్యార్థులకు నూతన సాంకే తికతపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్‌తోపాటు అవకాశాలు పొందవ చ్చన్నారు. కళాశాల అభివృద్ధికి తన వం తుగా సహాయం అందిస్తామని తెలిపా రు. అనంతరం వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కళాశాల కావల్సిన అభివృద్ధి పనులపై కళాశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ మంత్రి దృష్టికి తీసికెళ్ళారు. టీసీఎస్ ఒప్పంద మేరకు 93 మంది విద్యార్థులకు ప్లేస్ మెంట్ అవకాశాలను కల్పించాల్సిందిగా కోరారు. ప్రిన్సిపాల్ ప్రత్యేక అతిథిగృహం, స్టాఫ్ క్వార్టర్లకు నూతన భవనం, సోలార్ ప్లాంట్ ప్రతిపాదనలు చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్లేస్‌మెంట్ లభించిన 100 మంది విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. అత్యధిక మార్కులు సాదించిన విద్యార్థులకు మోడల్ అందించారు. యూనివర్సిటి వైస్ చాన్సలర్ కిషన్ కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వర్‌రావు, ఆర్జీ-3 జీఎం మధుసూదన్, వైస్ ప్రిన్స్‌పాల్ ఉదయ్‌కుమార్, సర్పంచ్ చిందంమహేష్, మార్కెట్‌కమిటి చైర్మన్ వైనాల రాజు, మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు డీసీపీ భూక్యరాంరెడ్డి, ఏసీపీ మడత రమేశ్, సీఐ రాజు, రామగిరి ఎస్‌ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.